విమానయాన సంస్థ ఇండిగో సోమవారం ప్రత్యేక గెట్ అవే సేల్‌ను ప్రారంభించింది. వచ్చే ఏడాడి జనవరి 23 నుండి ఏప్రిల్ 30 వరకు దేశీయ, అంతర్జాతీయ రూట్లలో ఈ తగ్గింపు టిక్కెట్లు అందించనున్నట్లు తెలిపింది.
దేశీయ ప్రయాణాలకు రూ.1,199 నుంచి, అంతర్జాతీయ రూట్లలో రూ.4,499 నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ డిసెంబర్ 25 వరకు ఉంటుంది. దీంతో పాటు ఈ యాడ్ ఆన్‌లపై గరిష్టంగా 15 శాతం డిస్కౌంట్ ఇస్తోంది.
ఇందులో అదనపు బ్యాగేజీ, ప్రామానిక సీట్ ఎంపిక, ఎమర్జెన్సీ ఎక్స్‌ఎల్ సీట్లు వంటివి ఉన్నాయి. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో డిసెంబర్ 31 వరకు టికెట్లు బుక్ చేసుకునేవారు దేశీయ ప్రయాణాలపై 15 శాతం, అంతర్జాతీయ ప్రయాణాలకు 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చని ఇండిగో తెలిపింది.