Tuesday, November 26, 2024

రెండవరోజూ సూచీల పతనం.. డౌన్ ట్రే డ్ అయిన మార్కెట్

సోమవారం నాడు కూడా ప్రధాన సూచీలో తగ్గుముఖంలోనే కొనసాగాయి. బీఎస్‌ఈ, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్‌చేంజీలు వరసగా రెండవ రోజు స్వల్పంగా తగ్గాయి. ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీ వాటాలు బలంగా నిలబడడంతో సూచీల పతనానికి కళ్లెం పడింది. బీఎస్‌ఈ సెన్‌సెక్స్‌ 84.88 పాయింట్లు తగ్గి 56,075.99 పాయింట్లకు చేరుకున్నది. అదేవిధంగా నిష్టీ 50 పాయింట్లు దిగజారి 17,069 పాయింట్లకు చేరుకున్నది. అంతకుముందు సెషన్‌ ఆరంభంలో రెండు సూచీలు దారుణమైన పతనాన్ని చూశాయి. ఒక దశంలో సెన్సెక్స్‌ 56,412 పాయింట్లకు, నిఫ్టి 16,917.25 పాయింట్లకు చేరుకున్నది. ఆ తరువాత సూచీలు కోలుకొని స్వల్ప తగ్గింపుతో ముగిశాయి.

సెన్సెక్స్‌ ప్యాక్‌లో సోమవారం నాడు టైటాన్‌ కంపెనీ గరిష్టంగా నష్టపోయింది. దాని షేర్‌ విలువ దాదాపు 3 శాతం పడిపోయింది. ఆ తరువాతి స్థానంలో విప్రో, టెక్‌ మహీంద్ర, ఇన్ఫోసిస్‌, మారుతీ సుజికి ఇండియా, ఆసియన్‌ పేయింట్స్‌ నిలిచాయి. కాగా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, టాటా స్టీల్‌, ఐటీసీ, హౌసింగ్‌ డవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (హెచ్‌డీఎఫసీ) ఎక్కువ లాభం పొందాయి. ఇక ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఐటీ సూచీ అత్యధికంగా నష్టపోయింది. దాదాపు 1.53 పాయింట్లు నష్టపోయింది. అయితే, నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ మాత్రం 0.57 పాయింట్లు లాభపడింది. ఇందుకు టాటా స్టీల్‌, నేషనల్‌ అల్యూమినియం కంపెనీల వాటాల విలువ పెరగడమే ప్రధాన కారణం. మిడ్‌ అండ్‌ స్మాల్‌ క్యాప్‌ షేర్స్‌ కూడా తిరోగమనంలోనే సాగాయి.నిఫ్టీ మిడ్‌ క్యాప్‌ 100 ఇండెక్స్‌ 0.59 పాయింట్లు తగ్గింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement