ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) సభ్య దేశాల సమావేశంలో భారత్‌కు మంచి విజయం దక్కిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రైతులు, మత్యకారుల ఉపాధి రక్షణకు భారత్ చేసిన కృషి ఫలించిందని చెప్పారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో నాలుగు రోజుల పాటు జరిగిన డబ్ల్యూటీవో సమావేశానికి ప్రతినిధి బృందంతో గోయల్ హాజరయ్యారు. కోవిడ్ వ్యాక్సిన్ తయారీపై ఉన్న పేటెంట్ హక్కుల ఎత్తివేతకు సభ్యదేశాలను ఒప్పించగలిగినట్లు పీయూస్ గోయల్ వెల్లడించారు. నియంత్రణలేని మార్గంలో చేపలు పట్టే విధానానికే తాజా మత్స్య పరిశ్రమ ఒప్పందం పరిమితమైనట్లు ఆయన తెలిపారు. ముందు ముందు దీన్ని ప్రభుత్వ రాయితీలకు వర్తింపచేస్తారని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ సబ్సిడీలపై ఎలాంఇ ఆంక్షలు లేవన్నారు. సముద్రలోతుల్లో చేపలు పట్టడాన్ని నియంత్రించాలని భారత్ చేసిన సూచనను డబ్ల్యూటీవో పరిగనలోకి తీసుకుందన్నారు. భారత వ్యవసాయ రంగానికి నష్టం కలిగించే ఎలాంటి ఒప్పందాలను ఈ సమావేశంలో చేసుకోలేదన్నారు. ఆహార ధాన్యాల నిల్వలపై ప్రస్తుతం మనం అనుసరిస్తున్న విధానానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఆహార భత్రతకు సంబంధించిన చర్యల్లో మాత్రం ఎలాంటి పురోగతి సాధించలేదన్నారు. ప్రపంచ ఆహార కార్యక్రమానికి అందే ఆహారపదార్ధాల ఎగుమతులపై ఎలాంటి నిషేధం ఉండకూడదన్న ఒప్పందాన్ని మన దేశ అభ్యంతరాలతో సవరించినట్లు చెప్పారు.
కోవిడ్‌ను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం చేసిన కృషి ఫలించిందని గోయల్ వెల్లడించారు. వ్యాక్సిన్ తయారీపై డబ్ల్యూటీవో విధించిన కొన్ని నిబంధనలను సడలించినట్లు చెప్పారు. దీని వల్ల అందుబాటు ధరలో సకాలంలో వ్యాక్సిన్ల తయారీ సులభతరం అవుతుందన్నారు. ఈ సడలింపు కేవలం వ్యాక్సిన్ల తయారీకి మాత్రమేనని, సంబంధిత ఔషధాలకు ఇది వర్తించదని చెప్పారు. ఈ కామర్స్ లావాదేవీలపై పన్ను విధింపుపై ఉన్న మారిటోరియాన్ని మరోసారి పొడిగించినట్లు గోయల్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.