Friday, November 22, 2024

నిలకడగానే భారతదేశ వృద్ధి.. ప్రపంచ మార్కెట్లలోనే అనిశ్చితి

2023 ఆర్థిక సంవత్సరంలో భారతీయ మార్కెట్లు పుంజుకోవడానికి బాహ్య కారకాలు ఎక్కువగా మద్దతిచ్చాయి. సుదీర్ఘకాలం ఒత్తిడి తర్వాత బలమైన ప్రవాహాలకు ఇది ఊపునిచ్చింది. అయితే, గత రెండు నెలల్లో పునరుద్ధరించిన గ్లోబల్ హెడ్‌విండ్‌లు భారతీయ మార్కెట్లపై ప్రభావం చూపాయని, ఇది సమీప కాలంలో కూడా ప్రతిబంధకంగా మారవచ్చని ఎంకే గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఒక నివేదికలో తెలిపింది. వచ్చే రెండు మూడు త్రైమాసికాలలో భారతీయ మార్కెట్లు కొన్ని సవాళ్లను చూడవచ్చు.

బిజీగా ఉండే ఎన్నికల సీజన్‌ మే 2024 వరకు రాజకీయ అనిశ్చితి తప్పదు. గ్లోబల్‌ మాక్రోలు కూడా తక్కువ మద్దతునిస్తాయి. బలమైన కమోడిటీ సైకిల్‌, బలహీన రుతుపవనాలు ఆందోళన కలిగించే అంశాలు. అలాగే గ్రామీణ వ్యయంలో పునరుద్ధరణకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఇందుచేత మార్కెట్లు బలహీన ట్రెండ్‌లో స్తబ్దతను కొనసాగించే అవకాలు మెండుగా ఉన్నాయి.

- Advertisement -

”విస్తృత మార్కెట్లు మిగిలిన 2024 ఆర్థిక సంవత్సరానికి ప్రతికూల దిశలో పయనించొచ్చు. స్మాల్‌, మిడ్‌ క్యాప్స్‌ తదుపరి 2-3 సంవత్సరాలలో మార్కెట్‌లను నడిపిస్తాయి. రాబోయే రెండు త్రైమాసికాలలో మరింత సవాలుగా ఉంటుంది. మా దృష్టిలో, స్వల్పకాలానికి అప్రమత్తంగా ఉండటం అవసరం. ప్రొ-సైక్లికల్‌ ఎక్స్‌పోజర్‌ల కోసం దిద్దుబాటును ఆశించొచ్చు” అని ఎంకే గ్లోబల్‌ నివేదిక పేర్కొంది. స్వల్పకాలిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, భారతదేశ స్థితిస్థాపక వృద్ధి కొనసాగడాన్ని మనం చూస్తున్నాం.

‘బ్యాలెన్స్‌ షీట్‌’ పటిష్టంగా ఉన్నందున, అపూర్వమైన ఆర్థిక స్థిరత్వం కీలకమైన చోదకశక్తి అవుతుంది. ఇది డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌ యొక్క ఎన్‌క్యాష్‌మెంట్‌ను అనుమతిస్తుంది. అంతేగాక పెరుగుతున్న తలసరి ఆదాయం సంపద, ప్రీమియమైజేషన్‌ను పెంచుతుంది అని నివేదిక పేర్కొంది. కాగా, భారత మార్కెట్ల జోరు కొనసాగుతోందని ఆనంద్‌ రాఠీ రీసెర్చ్‌ టీమ్‌ నివేదిక అభిప్రాయపడింది. ప్రపంచ అనిశ్చితి ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతీయ ఈక్విటీలు బలమైన రాబడిని అందించడం కొనసాగించాయి.

బలమైన స్థూల ఆర్థిక మూలాధారాలు, ఆరోగ్యకరమైన కార్పొరేట్‌ ఆదాయాల పనితీరు, ఈక్విటీ మార్కెట్‌లకు నిరంతర లిక్విడిటీ ప్రవాహం, సహెతుకమైన వాల్యుయేషన్‌ల కారణంగా, భారతీయ ఈక్విటీ మార్కెట్లు మీడియం టర్మ్‌లో పుంజుకునే అవకాశం ఉందని పేర్కొంది. స్వల్పకాలంలో మార్కెట్‌ అస్థిరతను పెంచే భౌగోళికర్ఖాజకీయ ఉద్రిక్తతలు ఏవైనా పెరగడం అనేది కీలకమైన ప్రమాదమని హెచ్చరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement