Tuesday, November 26, 2024

భారత్ అతిపెద్ద వ్యాపార భాగస్వామి అమెరికా.. దిగుమతుల్లోనూ వృద్ధి..

న్యూఢిల్లి : భారత్‌కు అతిపెద్ద వ్యాపార భాగస్వామి ఏదీ అంటే.. ముందుగా గుర్తుకొచ్చేది చైనా. కానీ ఈ చైనాను అమెరికా దాటేసింది. ఇప్పటి వరకు భారత్‌కు అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉంటూ వస్తున్న చైనాను అమెరికా వెనక్కి నెట్టేసింది. ఇప్పుడు భారత్‌కు అతిపెద్ద ట్రేడ్‌ పార్టనర్‌ ఏ దేశం అంటే.. అమెరికా చెప్పాల్సి ఉంటుంది. గతేడాది భారత్‌తో అత్యధిక వ్యాపారం చేసిన దేశంగా అమెరికా నిలిచినట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి ప్రకటించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అమెరికా- భారత్‌ మధ్య 119.42 బిలియన్‌ డాలర్ల వ్యాపారం జరిగినట్టు వెల్లడించింది. వాణిజ్య శాఖ అంచనా ప్రకారం.. అంతకు ముందు ఏడాది.. అంటే.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ వ్యాపారం విలువ 80.51 బిలియన్‌ డాలర్లుగా ఉండేది. గతేడాది అమెరికా-భారత్‌ మధ్య గణనీయ మైన వ్యాపారం జరిగింది. ఎగుమతులు, దిగుమతులు రెండూ భారీగా పెరగడమే దీనికి కారణం. చైనాను కొన్ని ఏళ్లుగా భారత్‌ పక్కన పెడుతూ వస్తున్నది.

చైనా తరువాత యూఏఈ….

ఈ సందర్భంగా ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఖలీద్‌ ఖాన్‌ మాట్లాడారు. అమెరికా తరువాత భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వాములుగా చైనా, యూఏఈ ఉన్నాయన్నారు. భారత్‌ విశ్వసనీయత కలిగిన వ్యాపార భాగస్వామిగా ఉందన్నారు. ప్రపంచం కూడా తమ అవసరాల కోసం చైనాపై ఆధారపడటం తగ్గిస్తోందని, అనేక దేశాలు భారత్‌ వైపు చూస్తున్నాయని తెలిపారు. చాలా దేశాలకు తమ వ్యాపారాలను భారత్‌కు మళ్లిస్తున్నాయని, రాబోయే రోజుల్లో భారత్‌-అమెరికా వ్యాపార సంబంధాలు మరింత బలపడుతాయని, ఇప్పటికే భారత్‌ ఇండో- పసిఫిక్‌ ఎకనామిక్‌ ఫ్రేమ్‌వర్క్‌లో చేరిందని గుర్తు చేశారు. ఈ నిర్ణయం మరిన్ని వ్యాపార అవ కాశాలను పెంచుతాయని అభిప్రాయపడ్డారు. 2013- 14 నుంచి 2017-18 వరకు భారత్‌కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉండిందన్నారు. అంతకు ముందు ఆ స్థానంలో యూఏఈ ఉండేదని గుర్తు చేశారు.

సౌదీ అరేబియా, ఇరాకతోేనూ వ్యాపారం..

2021-22లో 72.9 బిలియన్‌ డాలర్లతో యూఏ ఈ మూడో స్థానంలో కొనసాగుతోందని వివరించారు. ఆ తరువాత సౌదీ అరేబియా, ఇరాక్‌, సింగపూర్‌లు ఉన్నట్టు వివరించారు. భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న ప్రధాన వస్తువుల్లో సానపెట్టిన వజ్రాలు, ఔషధ ఉత్పత్తులు, ఆభరణాలు, లైట్‌ ఆయిల్స్‌, రొయ్యలు, ఇతర తయారీ వస్తువులున్నాయి. దిగుమతుల్లో ప్రధానంగా పెట్రోలియం, ముడి వజ్రాలు, సహజ వాయువు, బంగారం, బొగ్గు, తుక్కుతో పాటు బాదం వంటి వస్తువు లు ఉన్నాయి. 2021-22లో యూఏ ఈతో 72.90 బిలియన్‌ డాలర్ల వ్యాపారం జరిగింది. భారత్‌ వ్యాపార భాగస్వామిగా మూడో స్థానంలో ఉంది. ఆ తరువాత సౌదీ అరేబియాతో 42.85 బిలియన్‌ డాలర్లు, ఇరాక్‌తో 34.33 బిలియన్‌ డాలర్లు, సింగపూర్‌తో 30 బిలియన్‌ డాలర్ల వ్యాపారం జరిగింది.

- Advertisement -

2020-21లో 51బి. డాలర్ల ఎగుమతులు..

2020-21 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్‌ ఎగుమతుల విలువ 51.62 బిలియన్‌ డాలర్లు ఉంటే.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 76.11 బిలియన్‌ డాలర్లుగా నిలిచింది. 2020- 21 ఆర్థిక సంవత్సరంలో దిగుమతులు 29 బిలియన్‌ డాలర్లుగా ఉంటే.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 43.31 బిలియన్‌ డాలర్లుగా రికార్డయ్యింది. 2021-22లో చైనాతో భారత్‌ వ్యాపారం విలువ 115.42 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. అంతకుముందు సంవత్సరం ఈ విలువ 86.4 బిలియన్‌ డాలర్లుగా ఉండింది. చైనాతో కూడా మన దేశ వ్యాపారం విలువ పెరిగింది. కానీ.. అమెరికా ఓ అంతకంటే ఎక్కువ వ్యాపారం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా అమెరికాతో భారత్‌ ఇలాంటి వ్యాపార విలువనే కలిగి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజా గణాంకాలు అమెరికా-భారత్‌ మధ్య బలపడుతు న్న ఆర్థిక సంబంధాలకు నిదర్శనంగా నిపుణులు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement