Sunday, November 24, 2024

భారత ఆర్ధిక వ్యవస్థ బాగుంది.. ప్రపంచ ఆర్ధిక వేదిక అంచనా

రాజకీయ, ఆర్ధికపరమైన అనిశ్చితుల మూలంగా రానున్న సంవత్సరాల్లో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ బలహీనపడవచ్చని ప్రపంచ ఆర్ధిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) అంచనా వేసింది. ఆగ్నేయాసియాలో భారత్‌ వృద్ధిపై మెజార్టీ ఆర్ధికవేత్తలు విశ్వాసాన్ని వ్యక్తం చేసినట్లు పేర్కొంది. అదే సమయంలో ప్రతి ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, స్థిరాస్తి మార్కెట్‌ ఒడుదొడుకులు, చైనా ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపించవచ్చని ప్రపంచ ఆర్ధిక వేదిక విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

ఆర్ధిక, రాజకీయ ఒడుదొడుకుల ప్రభావంతో ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అందుకునే విషయంలో అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థ వెనకబడవచ్చని ప్రతి 10 మందిలో ఆరుగురు (60శాతం) విశ్లేషకులు అభిప్రాయపడినట్లు తెలిపింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా ప్రభావం చూపించవచ్చని 75 శాతం మంది అభిప్రాయపడినట్లు తెలిపింది. ఇటీవల అంతర్జాతీయంగా అధిక ద్రవ్యోల్బణ పరిస్థితులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని 86 శాతం మంది తెఇపారు.

- Advertisement -

కీలక వడ్డీరేట్ల పెంపు ప్రభావం కూడా తగ్గవచ్చని వీరు పేర్కొన్నారు. అంతర్జాతీయ అనిశ్చితుల ప్రభావం అభివృద్ధి చెందిన దేశాలపైనే ఎక్కువగా ఉండవచ్చని ముఖ్య ఆర్ధికవేత్తలు హెచ్చరించారు. చాలా దేశాల్లో ఆహార భద్రత, వాతావరణం, జీవవైవిద్య పరిరక్షణ వంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో పురోగతి నెమ్మదించడం ఆందోళనకర విషయమని నివేదిక పేర్కొంది. 2030 లోనూ సుమారు 50 కోట్ల మందికిపైగా జనాభా తీవ్ర పేదరికంలోనే ఉండే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

రానున్న మూడేళ్లలో వర్థమాన, అభివృద్ధి చెందిన దేశాల మధ్య సహకారం పెరగవచ్చని 41 శాతం మంది ఆర్ధికవేత్తలు వెల్లడించారు. ప్రైవేట్‌ పెట్టుబడుల్లో వృద్ధి కొనసాగుతుందని 30 శాతం మంది తెలిపారు. ఈ సంవత్సరం ఆగ్నేయాసియా ముఖ్యంగా భారత్‌ బలమైన వృద్ధిని నమోదు చేయవచ్చని 90 శబుూతం మంది ఆర్ధికవేత్తలు వెల్లడించారు.

అమెరికాలో 2023, 2024లో బలమైన వృద్ధి ఉండవచ్చని పదిలో 8 మంది ఆర్ధికవేత్తలు అభిప్రాయపడినట్ల నివేదకి తెలిపింది. ఐరోపాలో ఈ సంవత్సరం బలహీనమైన వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని 77 శాతం మంది అంచనా వేశారు. 2024లో బలమైన వృద్ధి ఉండవచ్చని 60 శాతం మంద అభిప్రాయపడినట్లు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement