Tuesday, November 19, 2024

బ్లాక్ ఫ్రైడే వేళ, చిన్న వ్యాపారులకు సైతం ఇచ్చేందుకు భారతీయుల ఆసక్తి : గోడాడీ అధ్యయనం

హైద‌రాబాద్ : ఈ సంవత్సరం వినియోగదారులు తమ స్నేహితులు, కుటుంబాలకు మాత్రమే కాకుండా చిన్న వ్యాపారాలకు కూడా ఇచ్చే మూడ్ లోనే వున్నారు. గోడాడీ సర్వే ప్రకారం, 86శాతం భారతీయ కోలుగోలుదారులు బ్లాక్ ఫ్రైడే, ఈ సంవత్సరం సెలవుల సీజన్‌లో చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు.

(ప్రపంచ సగటు 72శాతంతో పోలిస్తే) వారిలో 23శాతం మంది వరకు 15శాతం ఎక్కువ ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ద్రవ్యోల్బణం వినియోగదారుల వ్యయంపై అధిక ప్రభావం చూపుతుండగా భారతీయులు ఆశాజనకంగానే ఉన్నారు. గోడాడీ సర్వే ప్రకారం, 35శాతం మంది భారతీయ వినియోగదారులు ద్రవ్యోల్బణం తమ హాలిడే షాపింగ్‌ను ప్రభావితం చేయదని చెప్పారు, మరో 30శాతం మంది ద్రవ్యోల్బణం తాము షాపింగ్ చేసే విధానాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పారు.

ఈసందర్భంగా గోడాడీ ఇండియా.సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్, అపూర్వ పల్నిట్కర్ మాట్లాడుతూ… సెలవు సీజన్‌లో కస్టమర్‌లను చేరుకోవడానికి, తమ మార్కెటింగ్ వ్యూహాలను త్వరగా అమలు చేయడానికి చిన్న వ్యాపారాలకు సరైన సాధనాలను అందించడానికి గోడాడీ కట్టుబడి ఉందన్నారు. డిజిటల్ మార్కెటింగ్, వెబ్‌సైట్ బిల్డర్ వంటి తమ ఉత్పత్తులు సోషల్ మీడియా ప్రచారాలు, ఇమెయిల్ మార్కెటింగ్‌ను సులభంగా ప్రారంభించడంలో సహాయపడతాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement