Friday, November 22, 2024

బిగ్‌బుల్‌కు ఒకే నెలలో 832 కోట్ల లాభం.. రెండు స్టాక్స్ లో భారీ ప్రాఫిట్‌

భారత్‌ స్టాక్‌ మార్కెట్‌ బిగ్‌బుల్‌, ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ ఝున్‌ వాలా మరోసారి లాభాలను ఆర్జించారు. గడిచిన నెలలో ఏకంగా రూ.832 కోట్లను తన ఖజానాలో వేసుకున్నారు. ఆయన సంపదను భారీగా పెంచేందుకు రెండు కంపెనీలు ప్రధాన కారణంగా నిలిచాయి. స్టార్‌ హెల్త్‌, మెట్రో బ్రాండ్స్‌ కంపెనీలు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. గత కొద్ది రోజులుగా ఈ స్టాక్స్‌ గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. ఒక్క నెల కాలంలో స్టార్‌ హెల్త్‌ షేర్‌ విలువ రూ.686.60 నుంచి రూ.741.10కు చేరుకుంది. అదేవిధంగా గత నెలలో మెట్రో బ్రాండ్స్‌ షేర్లు రూ.531.95 నుంచి రూ.604కు పెరిగింది.

స్టార్‌ హెల్త్‌లో 10కోట్ల షేర్లు…

స్టార్‌ హెల్త్‌లో రాకేష్‌ ఝున్‌ ఝున్‌ వాలా, ఆయన భార్య రేఖ ఝున్‌ ఝున్‌ వాలాకు 10,07,53,935 షేర్లు కలిగి ఉన్నారు. ఇది కంపెనీ మొత్తం వాటాలో 17.50 శాతం వాటా. మెట్రో బ్రాండ్స్‌లో షేర్‌ హోల్డింగ్‌ చూసుకుంటే.. గతేడాది అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు రాకేశ్‌ ఝున్‌ ఝున్‌ వాలా తన భార్య ద్వారా ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. రేఖా ఝున్‌ ఝున్‌ వాలా కుటుంబానికి చెందిన 3 ట్రస్టుల ద్వారా ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. స్టార్‌ హెల్త్‌లో ఝున్‌ ఝున్‌ వాలా షేర్లను (10,07,53,935) ఒక్కో షేరు పెరుగుదలతో గుణించగా.. ఆయన గత నెలలో ఈ స్టాక్‌ ద్వారా తన నికర విలువను రూ.550 కోట్లు పెరిగింది. అదేవిధంగా మెట్రో బ్రాండ్ల ద్వారా రేఖా ఝున్‌ ఝున్‌ వాలా ఒక నెలలో రూ.282 కోట్లు ఆర్జించారు. ఈ రెండూ కలిపితే.. కేవలం ఒక్క నెలలో రాకేష్‌ ఝున్‌ ఝున్‌ వాలా మొత్తం ఆస్తుల విలువ రూ.832 కోట్లు పెరిగాయి. ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలు ఈ కంపెనీల షేర్లపై బులిష్‌గానే ఉన్నాయి. ఈ కంపెనీలకు మరింత ఎక్కువ టార్గెట్‌ను సూచిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement