Friday, November 22, 2024

పడిపోయిన రూపాయి విలువ..

విదేశీ పెట్టుబడుల వెల్లువ, క్రూడ్‌ ఆయిల్‌ ధరల పెరుగుదల ప్రభావం రూపాయిపై పడింది. డాలర్‌తో పోలిస్తే ఎనిమిది పైసల మేర తగ్గి 77.66 వద్ద నిలిచింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ మార్కెట్‌లో దీని విలువ 77.74గా మొదలైంది. 77.76 వద్ద స్థిరపడింది. ఇది గ త ముగింపుకంటే ఎనిమిది పైసలు తక్కువ. ఈ సె షన్‌లో అమెరికా కరెన్సీతో పోలిస్తే అత్యంత తక్కువగా 77.81కి పడిపోయింది. బుధవారం మాత్రం కొంత కోలుకుంది. ఆర్బీఐ విధాన నిర్ణయాన్ని ప్రకటించినప్పటికీ రూపాయి మార్కెట్‌ విలువ తక్కువగానే ఉందని ఫారెక్స్‌ బులియన్‌ ఎనలిస్టు మోతీ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రతినిధి చెప్పారు.

కాగా బుధవారం నాడు ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను 50 బేస్‌ పాయింట్లమేర పెంచింది. ఇలా పెంచడం ఐదు వారాల వ్యవధిలో రెండోసారి. నిత్యావసరాల ధరలు నానాటికీ పెరిగిపోవడం సామాన్యుడికి ఇబ్బందికరంగా మారడంతో ఆర్బీఐ పైవిధంగా వ్యవహరించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement