Saturday, November 23, 2024

ప్ర‌పంచాన్ని ఏలుతున్న భారతీయ బాస్‌లు.. స్టార్‌బక్స్‌కు సీఈఓగా లక్ష్మణ్‌ నరసింహన్‌

కాఫీ వ్యాపారంలో అంతర్జాతీయ కంపెనీగా ఉన్న స్టార్‌బక్స్‌కు మరో భారతీయ వ్యక్తి బాస్‌గా నియమించబడ్డారు. సంస్థకు సీఈఓగా లక్ష్మణ్‌ నరసింహన్‌ను నియమిస్తున్నుట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం ఆయన బ్రిటన్‌ కేంద్రంగా ఉన్న రెకిట్‌ బెకిజర్‌కు సీఈఓగా ఉన్నారు. ఈ కంపెనీ నుంచి సెప్టెంబర్‌ 30న బయటకు వస్తున్నట్లు గురువారం నాడు ఆయన ప్రకటించారు. మూడు సంవత్సరాలుగా ఆయన ఈ బాధ్యతల్లో ఉన్నారు.

రెకిట్‌కు ముందు ఆయన ప్రముఖ సాఫ్ట్‌ డ్రింక్‌ సంస్థ పెప్సికో లో వివిధ హోదాల్లో పని చేశారు. స్టార్‌బక్స్‌, పెప్సీకో మధ్య చాలా కాలంగా పలు అంశాల్లో ఒప్పందాలు ఉన్నాయి. అక్టోబర్‌లో నర్సింహన్‌ స్టార్‌బక్స్‌లో చేరతారు. అప్పటి వరకు ఆ హోదాలో ఉన్న హోవర్డ్‌ షూల్జ్‌ కొనసాగుతారు. నరిసింహన్‌ ఏప్రిల్‌లో సీఈఓగా పూర్తి భాద్యతలు స్వీకరిస్తారు. తరువాత కూడా ప్రస్తుత సీఈఓగా ఉన్న హోవర్డ్‌ ఫూల్జ్‌ బోర్డులో కొనసాగుతారని కంపెనీ తెలిపింది.

ఐదు సంవత్సరాల తరువాత కెవిన్‌ పీటర్సన్‌ సీఈఓ గా భాద్యతల నుంచి తప్పుకోవడంతో షూల్జ్‌ ఏప్రిల్‌లో తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారు. అనేక మందని ఇంటర్వ్య చేసిన కంపెనీ చివరకు నర్సింహన్‌ను ఈ బాధ్యతల్లోకి తీసుకోవాలని నిర్ణయానికి వచ్చింది. సీఈఓగా నరసింహన్‌ అనేక సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఉద్యోగులు చాలా కాలంగా మెరుగైన ప్రయోజనాల కోసం ఆందోళనలు చేస్తున్నారు. దీని వల్ల కంపెనీ పలు న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కరోనా సంక్షోభం నుంచి పలు దేశాల్లో కంపెనీ ఇంకా కోలుకోవాల్సి ఉంది. మారిన వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా కంపెనీని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. లక్ష్మణ్‌ నరసింహన్‌ సీఈఓగా ఎంపికైన స్టార్‌బక్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా 34 వేల స్టోర్స్‌ ఉన్నాయి.

లక్ష్మణ్‌ ప్రస్తానం

లక్ష్మణ్‌ నరసింహన్‌ 1957, ఏప్పిల్‌ 15న పుణేలో జర్మించారు. పుణే కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ నుంచి మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందారు. యూనివర్శిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాకు చెందిన లాడర్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి జర్మన్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌లో ఎంఏ పట్టా తీసుకున్నారు. ఇదే యూనివర్శిటీలో వార్టన్‌ స్క్‌ల్‌ నుంచి ఎంబీఏ కూడా చేశారు. దీని తరువాత ఆయన ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మెకిన్సీలో ఉద్యోగంలో చేరారు. అక్క్డే ఢిల్లి ఆపీస్‌ డైరెక్టర్‌ లోకేషన్‌ మేనేజర్‌ స్థాయికి చేరుకునారు. పెప్సికోలో సీసీఓ స్థాయికి చేరుకున్నారు. అనంతరం రెకిట్‌ బెంకిజర్‌లో సీఈఓగా చేరారు.

- Advertisement -

పెరుగుతున్న ఇండియన్‌ సీఈఓలు

అమెరికా కేంద్రంగా పని చేస్తున్న పలు బహుళ జాతి కంపెనీలకు భారతీయులే బాస్‌లుగా ఉన్నారు. వీటిలో అతి ముఖ్యమైనవి మైక్రోసాఫ్ట్‌ సీఈఓగా సత్య నాదేంళ్ళ ఉన్నారు. మరో ప్రముఖ కంపెనీ అడోబ్‌కు సీఈఓగా శాంతన్‌ నారాయణ్‌, అల్ఫాబెట్‌ (గూగుల్‌) సీఈఓగా సుందర్‌ పిచాయ్‌, ట్విటర్‌ హెడ్‌గా పరాగ్‌ అగర్వాల్ ఉన్నారు. పెప్సికో సీఈఓగా మన దేశానికే చెందిన ఇంద్రనూయి 12 సంవత్సరాల పాటు పని చేశారు. ఆమె 2018లో పదవీ విరమణ చేశారు. ఐబీఎం కంపెనీకి ఛైర్మన్‌, సీఈఓగా మన భారతీయుడైన అరవింద్‌ కృష్ణన్‌ పని చేస్తున్నారు. ఆల్బర్ట్‌సన్స్‌కు వివేక్‌ శంకరణ్‌ ప్రెసిడెంట్‌, సీఈఓగా ఉన్నారు. మైక్రాన్‌ టెక్నాలజీస్‌కు సంజయ్‌ మల్హోత్రా ప్రెసిడెంట్‌, సీఈఓగా వ్యవహరిస్తున్నారు. మరో అంతర్జాతీయ సంస్థ బర్కాలాస్‌కు సీఎస్‌ వెంటకేషన్‌ సీఈఓగా ఉన్నారు. డిలైట్‌కు సీఈఓగా పునీత్‌ రాజేన్‌ సీఈఓగా ఉన్నారు. ఫెల్స్‌ కంపెనీకి రేవతి అద్వైతి సీఈఓగా పని చేస్తున్నారు. ఇలా పలు కంపెనీలకు మన దేశానికి చెందిన వారే సారధ్యం వహిస్తున్నారు. 1990 కంటే ముందు కూడా కొన్ని కంపెనీలకు మన దేశానికి చెందిన వారు సారధ్య బాధ్యతల్లో పని చేశారు. ఇంద్రనూయి తరువాత ఈ సంఖ్య గణనీయంగా పెరుగతూ వస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement