వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రిడేటర్ డ్రోన్ డీల్‌ను ముగించాలని భారత్, అమెరికా చూస్తున్నాయి. 2024 మార్చి నాటికి ఒప్పందం కుదుర్చుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని యుఎస్ డిఫెన్స్ మేజర్ ఒకరు చెప్పారు. 31 ఎంక్యు-9బి ప్రిడేటర్ ఆర్మీ డ్రోన్లకు సంబంధించిన ఈ ఒప్పందం భారత్‌కు కీలకం కానుంది. రెండు ప్రభుత్వాల మధ్య కుదుర్చుకునే ఈ ఒప్పందాన్ని యూఎస్ కాంగ్రెస్ కొద్ది వారాల్లో క్లియర్ చేస్తుందని భావిస్తున్నారు.
యుఎస్ డిఫెన్స్ మేజర్ జనరల్ అటామిక్స్ (జిఎ) నుండి డ్రోన్‌ల కొనుగోలు కోసం భారతదేశం లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ (ఎల్‌ఓఆర్)పై కాంగ్రెస్ ఆమోదం తెలిపిన తర్వాత, ఇరుదేశాల ప్రభుత్వ అధికారులు కొనుగోళ్లపై తుది చర్చలు జరుపుతారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి దీర్ఘకాలం నిఘా సాగించేందుకు భారత్ ఈ ‘హంటర్-కిల్లర్’ డ్రోన్‌లను కొనుగోలు చేస్తోంది. చర్చల ప్రక్రియలో డ్రోన్‌ల ధర ఖరారు చేయబడినప్పటికీ, వీటి సేకరణకు సుమారు 3 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా వేయబడింది. ఈ నెల ప్రారంభంలో ఢిల్లిలో డిఫెన్స్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ జె ఆస్టిన్ జరిపిన చర్చల సందర్భంగా భారతదేశం ప్రతిపాదించిన డ్రోన్‌ల సేకరణ ప్రస్తావనకు వచ్చిన విషయం తెలిసిందే.