మన దేశంలో వచ్చే ఏడాది నుంచి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపి విక్రయించనున్నారు. 2023, ఏప్రిల్ నుంచి ఈ పెట్రోల్‌ను ఎంపిక చేసిన బంక్‌ల్లో అమ్మనున్నారు. తరువాత కాలంలో వీటి అమ్మకాలను విస్తరించనున్నారు. పెట్రోల్, డీజిల్ దిగుమతులు తగ్గించుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతుందని పెట్రోలియం శాఖ మంత్రి హరిదీప్ పూరీ తెలిపారు. 2025 వరకు ఇథనాల్ పెట్రోల్ ఎక్కువ ఉండేలా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు 2025 సంవత్సరంలోగా 20 శాతం ఇథనాల్ కలిపి పెట్రోల్‌ను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ఇథనాల్‌ను చెరకు నుంచి, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తీస్తున్నారు. పానిపట్‌లో సెకండ్ జనరేషన్ ఇథనాల్ ప్లాంట్‌ను ప్రధాన మంత్రి గురువారం నాడు ప్రారంభించ నున్నారు. ఈ ప్లాంట్‌ను ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ 900 కోట్లతో నిర్మించింది. ఈ ప్లాంట్‌లో సంవత్సరానికి 3 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను ఉత్పత్తి చేయనున్నారు. చెరకుతో పాటు, వరిపొట్టు నుంచి దీన్ని తీయనున్నారు. ఈ ప్లాంట్ నుంచి ఎలాంటి వ్యర్ధాలు ఉత్పత్తి కావని ఆయన తెలిపారు. ఈ ప్లాంట్ వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గుతాయని, సంవ త్సరానికి 3 లక్షల టన్నుల కార్బన్‌డైయాక్సైడ్‌కు ఇది సమానమని చెప్పారు. పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్ కలపడం వల్ల 41,500 కోట్ల వరకు లద్ధి చేకూరినట్లుగా అంచనా వేసినట్లు చెప్పారు. దీని వల్ల 27 లక్షల టన్నుల కాలుష్యకారక వాయుల ఉత్పత్తి తగ్గిందని చెప్పారు. ప్రస్తుతం మన దేశం ఇథనాల్ ఉత్పత్తిలో 5వ పెద్ద దేశంగా ఉందన్నారు. ఈ విషయంలో అమెరికా, బ్రెజిల్, ఈయూ, చైనా తరువాత మన దేశం ఉందన్నారు.
పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడం వల్ల సంవత్సరానికి 4 బిలియన్ డాలర్లను ఆదా చేసుకోవచ్చని వివరించారు. మొదటి మూడు నాలుగు నెలల్లో ఇథనాల్ కలపడం వల్ల 20 లక్షల టన్నుల ముడి చమురు మిగులుతుందని చమురు మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలో 306.43 కోట్ల లీటర్ల ఇథనాల్ సరఫరా అవుతోంది. 20 శాతం కలపడం ప్రారం భమైతే సంవత్సతరాలనికి 1000 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరం అవుతుంది. ఇథనాల్ ఎంత పెరిగితే ముడి చమురు దిగుమతులు ఆ మేరకు తగ్గుతాయని తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.