Friday, November 22, 2024

కరోనా దెబ్బ నుంచి కోలుకున్న భారత్‌, వృద్ధిరేటు సంతృప్తికరం

మూడు సార్లు కరోనా పంజా విసిరినా భారత్‌ ఆర్థిక వ్యవస్థ బలంగా కోలుకుందని అమెరికా ఆర్ధిక శాఖ తన నివేదికలో పేర్కోంది. 2021 మధ్యలో వచ్చిన రెండో దశ కరోనా ఆర్థిక వ్యవస్థ పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ, తిరిగి బలంగా పుంజుకుందని తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా జరగడం కూడా ఇందుకు తోడ్పడిందని అభిప్రాయపడింది.
దేశంలో 2021 చివరినాటికి 44 శాతం మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు తెలిపింది. 2020లో 7 శాతం క్షిణించిన ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు , 2021 రెండో త్రైమాసికం నాటికి కోవిడ్‌ పూర్వ స్థాయికి చేరుకుందని తెలిపింది. 2022లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ శరవేగంగా విస్తరించిన్పటికీ, భారత్‌ ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపించలేదని తెలిపింది. ఈ దశలో మరణాలు కూడా తక్కవగానే నమోదైనట్లు పేర్కొంది. 2021 పూర్తి సంవత్సరంలో భారత్‌ వృద్ధిరేటు 8 శాతంగా ఉందని నివేదికలో పేర్కొన్నారు.
కరోనా ప్రభావం నుంచి కొలుకునేందుకు 2021 నుంచి ప్రభుత్వం ఆర్ధిక వ్యవస్థకు నగదు మద్దతు ఇచ్చిందని తెలిపింది. 2022 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో ద్రవ్యలోటు 6.9 శాతం ఉంటుందని భారత్‌ ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేశారని తెలిపింది. ఇది కరోనా సోకడానికి ముందు అంచనాల కంటే అధికం.

రిజర్వ్‌ బ్యాంక్‌ కరోనా సమయంలో 2020 మే వరకు వడ్డీరేట్లను 4 శాతంగానే ఉంచిందని అమెరికా తన ని వేదికలో తెలిపింది. 2021 జనవరి నుంచి వడ్డీరేట్లను సవరిస్తూ, ద్రవ్య లభత ఉండేలా చర్యలు తీసుకుందని తెలిపింది. 2020 ఆర్థిక సంవత్సరంలో మొత్తం జీడీపీలో కరెంట్‌ అకౌంట్‌ మిగులు 1.3 శాతంగా ఉందని, 2004 తరువాత ఇలా మిగులు ఉండటం మొదటిసారిని పేర్కొంది. 2021లో జీడీపీలో ద్రవ్యలోటు 1.1 శాతానికి చేరుకుందని తెలిపింది. ఫలితంగా 2021లో వాణిజ్య లోటు 177 బిలియన్‌ డాలర్లకు పెరిగిందని పేర్కొంది. ఇది అంతకు ముందు సంవత్సరం 95 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2021 మొదటి ఆరు నెలల కాలంలో దిగుమతులు భారీగా పెరిగాయని తెలిపింది. నిత్యావసరాలతో పాటు, చమురు ధరలు పెరిగినట్లు పేర్కోంది. ఈ కాలంలో దిగుమతులు 54 శాతం పెరిగాయి. అదే కాలంలో ఎగుమతులు పెరిగినప్పటికీ, ఇది స్వల్పంగా ఉందని పేర్కొంది. సర్వీసెస్‌ గూడ్స్‌ లోటు3.3 శాతానికి పెరగడం, వాణిజ్యలోటు అంతకంతకూ పెరగడం వంటివి ఆందోళన కలిగించే అంశాలని పేర్కొంది. విదేశాల నుంచి మన దేశానికి చెందిన పంపించే డబ్బు 2021లో 5 శాతం పెరిగి, 87 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఇది జీడీపీలో 2.8 శాతం. భారత ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక సూత్రాలు బలంగానే ఉన్నాయని నివేదిక అభిప్రాయపడింది. భారత్‌, అమెరికా మధ్య 2013 నుంచి 2020 వరకు ద్వైపాక్షిక వాణిజ్య మిగులు కొనసాగిందని తెలిపింది. 2021లో గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ వాణిజ్య మిగులు 45 బిలియన్‌ డాలర్లగా ఉంది. ఇది 2020 డిసెంబర్‌ నాటికి 34 బిలియన్‌ డాలర్లుగా ఉంది..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement