భారత తన ఆయుధ వ్యవస్థను బహుముఖీనం చేయాలని సంకల్పించింది. ఇంత వరకూ రష్యా సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడుతున్న భారత్ ఇకపై అమెరికాతో కలిసి డ్రోన్లను తయారు చేయనున్నది. ఈ విషయాన్ని గురువారం అమెరికా రక్షణ (పెంటగాన్) అధికారులు తెలిపారు.
రక్షణ రంగంలో ఇరుదేశాల మధ్య భాగస్వామ్యం ఉన్న నేపధ్యంలో చైనాను ఎదుర్కొనేందుకు భారత్ తో కలిసి డ్రోన్లను నిర్మించాలని నిర్ణయించినట్టు పెంటగాన్ అధికారులు వివరించారు. రక్షణ వ్యవస్థ ఆధునీికరణ కార్యక్రమాలను భారత్తో కలిసి నిర్వహించాలనీ, తద్వారా ఉపఖండంలోని తమ మిత్ర దేశాలకు వాటిని అందించాలని నిర్ణయించినట్టు పెంటగాన్ అధికారులు తెలిపారు.