Thursday, November 21, 2024

క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌.. భారత్‌-ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ జియో సినిమాలో ఫ్రీ స్ట్రీమింగ్‌

ఆసియాకప్‌ అనంతరం టీమిండియా సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడనుంది. అయితే ఆ సిరీస్‌ను కూడా భారత క్రికెట్‌ అభిమానుల కోసం రిలయన్స్‌ సంస్థకు చెందిన జియోసినిమా ఉచితంగా స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ ఏడాది జరిగిన దేశవాలి మెగా క్రికెట్‌ టోర్నీ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)ను మొబైళ్లలో ఫ్రీ స్ట్రీమింగ్‌ చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడ తాజాగా ప్రపంచకప్‌కు ముందు ఆసీస్‌తో జరిగే ముడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కూడా ఉచితంగా ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది.

సెప్టెంబర్‌ 22, 24, 27 తేదిల్లో మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక ఈ సిరీస్‌ను మొత్తం 11 భాషల్లో వీక్షించే అవకాశం కల్పించనుంది. ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, గుజరాతీ, మరాఠీ, భోజ్‌పురి, బెంగాలీ, పంజాబీ భాషల్లో ప్రసారం చేయనుంది. దీంతో భారత క్రికెట్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే బీసీసీఐ ప్రసారా హక్కులను రిలయన్స్‌ గ్రూప్స్‌కే చెందిన వయాకామ్‌ 18 సొంతం చేసుకుంది. ఇక జియోసినిమా కూడా రిలయన్స్‌ సంస్థదే కావడంతో ఆసిస్‌-భారత్‌ సిరీస్‌ను ఫ్రీ స్ట్రీమింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement