హైదరాబాద్ : సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేసే వారిలో మొదటిసారి కారు కొనుగోలు చేసేవారు 73 శాతం మంది ఉన్నారు. 2023లో సెకండ్ హ్యాండ్ కార్ల డిజిటల్ సేల్స్ కూడా గణనీయంగా పెరిగాయని ప్రముఖ సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయ సంస్థ స్పిన్నీ తెలిపింది. 2023లో ఆన్‌లైన్ అమ్మకాలు 13 శాతం పెరిగి 70 శాతానికి చేరినట్లు తెలిపింది. సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేస్తున్నవారిలో 73 శాతం మంది మొదటిసారి కారు కొనేవారే ఉన్నారని తెలిపింది.
ఈజీ ఫైనాన్స్ అవకాశాలు, లో ఈఎంఐ వంటి వాటి మూలంగా ఈ కార్లు కొనేవారి సంఖ్య పెరుగుతోందని స్పిన్నీ వార్షిక నివేదికలో తెలిపింది. ఈ సంవత్సరం ఫెస్టివల్ సీజన్ అక్టోబర్ 15 నుంచి దీపావళీ వరకు స్పిన్నీ 8000 కార్లను విక్రయించినట్లు తెలిపింది. ప్రధానంగా మారుతీ సుజుకీ, హ్యుండాయ్, హోండా కంపెనీకి చెందిన కంపెనీ కార్లు ఎక్కువగా అమ్మకాలు జరిగాయి.
71 శాతం మంది కార్పోరేట్ ప్రొఫెషనల్స్ సెకండ్ హ్యాండ్‌కార్లను కొనుగోలు చేశారని తెలిపింది. ఎస్‌యూవీల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. ఢిల్లిd-ఎన్‌సీఆర్, హైదరాబాద్, బెంగళూర్ నగరాల్లో ఈ కార్లకు ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు తెలిపింది. కొనుగోలుదారుల్లో 35 శాతం మంది మహిళలు ఉన్నాట్లు స్పిన్నీ తెలిపింది. 46 శాతం మంది కారు ఫైనాన్స్ ద్వారా వీటిని కొనుగోలు చేసినట్లు తెలిపింది.