దేశంలో క్రమంగా విద్యుత్ బస్సుల అమ్మకాలు పెరుగుతున్నాయి. కొత్తగా ప్రారంభమైన రెండు కంపెనీలు ఇ-బస్సుల అమ్మకాల్లో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ప్రముఖ వాహనాల ఉత్పత్తి సంస్థ టాటా ఇ-బస్సుల ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉంది.
ఢిల్లి కేంద్రంగా ఐదు సంవత్సరాల క్రితం స్టార్టప్ కంపెనీ గా ప్రారంభమైన పీఎంఐ ఎలక్ట్రో మొబిలిటి విద్యుత్ బస్సుల ఉత్పత్తి, అమ్మకాల్లో మొదటి స్థానంలో ఉంది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ కంపెనీ విద్యుత్ బస్సుల అమ్మకాల్లో దేశంలోనే రెండో స్థానంలో ఉంది. పీఎంఐ ఎలక్ట్రో మొబిలిటికి ఈ సంవత్స రం జనవరి-సెప్టెంబర్ నెలల మధ్యలో 547 రిజిస్ట్రేషన్లు వచ్చాయి. ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ కంపెనీకి ఇదే కాలంలో 443 రిజిస్ట్రేషన్లు వచ్చాయి. గుర్గామ్ కేంద్రంగా పని చేస్తున్న జేబీఎం ఆటో కంపెనీ 259 రిజిస్ట్రేషన్లతో మూడో స్థానంలో ఉంది. మరో ప్రముఖ వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్ గ్రూప్ కంపెనీ స్వచ్చ్ మొబిలిటి 222 విద్యుత్ బస్సుల రిజిస్ట్రేషన్లతో నాలుగో స్థానంలో ఉంది. టాటా మోటర్స్ కంపెనీ 110 విద్యుత్ బస్సుల రిజిస్ట్రేషన్లతో 5వ స్థానంలో నిలిచింది.
మొదటి రెండు స్థానాల్లో ఉన్న కంపెనీలు పీఎంఐ, ఒలెక్ట్రా కంపెనీలు చైనాకు చెందిన కంపెనీలతో టెక్నికల్ భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. పీఎంఐ కంపెనీకి ఫోటన్ కంపెనీతోనూ, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ కంపెనీకి బీవైడీ కంపెనీతో ఒప్పందం ఉంది. మన దేశంలో విద్యుత్ బస్సుల తయారీ ప్రారంభమైన నాటి నుంచి ఈ రెండు కంపెనీలే అగ్రస్థానంలో ఉంటూ వస్తున్నాయి. బీవైడీ కంపెనీ చైనాలో అతి పెద్ద విద్యుత్ వాహనాల తయారీ కంపెనీగా ఉంది. ఈ కంపెనీకి చెందిన బీవైడీ కార్లు టెస్లా కంటే అధిక అమ్మకాలను నమోదు చేస్తున్నాయి. చైనాతో అనేక దేశాల్లో ఈ కంపెనీ విద్యుత్ కార్లను, బస్సులను, ట్రక్కులను విక్రయిస్తోంది. ప్రస్తుతం మన దేశంలో విద్యుత్ బస్సులను తయారు చేస్తున్న కంపెనీలు పెద్ద ఎత్తున వీటిని తయారు చేయడంలేదు. అర్డర్లు భారీగా తీసుకుంటే సమయానికి వాటిని కస్టమర్లకు అందించాల్సి ఉంటుంది. అందు వల్ల ఈ కంపెనీలు ఆర్డర్లు పెంచుకునేందుకు బదులు, తీసుకున్న ఆర్డర్లును సమయానికి పంపిణీ చేయడంపైనే పీఎంఐ దృష్టి పెట్టింది. దీని వల్ల తమకు మరిన్ని ఆర్డర్లు వస్తున్నాయని తెలిపింది. ప్రధానంగా రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థల నుంచి బస్సులకు ఆర్డర్లు వస్తున్నాయని కంపెనీ తెలిపింది. టాటా మోటర్స్‌కు కన్వర్జెన్సీ ఎనర్జీ సర్వీసెస్(సీ ఈఎస్‌ఎల్) టెండర్ ద్వారా 3,800 విద్యుత్ బస్సుల ఆర్డర్ వచ్చినట్లు తెలిపింది.
ఇవి కాక మరో 200 విద్యుత్ బస్సులకు జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపింది. ఒప్పం దం ప్రకారమే తాము విద్యుత్ బస్సులకు ఆయా సంస్థలకు అందిస్తామని టాటా మోటార్స్ బస్సుల డివిజన్ వైస్ ప్రెసిడెంట్ రోహిత్ శ్రీవాస్తవా చెప్పారు. పీఎంఐ ఎలక్ట్రో కంపెనీ రోజుకు 8 విద్యుత్ బస్సులను తయారు చేస్తోంది. దీని వల్ల ఒప్పందం ప్రకారమే సమయానికి ఆయా సంస్థలకు బస్సులను డెలివరీ చేయకలు గుతున్నామని తెలిపింది. ఈ కంపెనీ విద్యుత్ బస్సులను ఉత్పత్తి చేయడంతో పాటు, వాటి ఛార్జింగ్, నిర్వహణపై కూడా దృష్టి పెట్టింది. పీఎంఐ కంపెనీ 23 విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. సీఈఎస్ ఎల్ మొత్తం 50 వేల విద్యుత్ బస్సులను వివిధ రాష్ట్రాలకు అందించనుంది. ఇందు కోసం జాతీయ విద్యుత్ బస్సుల కార్యక్రమం కింద ఈ బస్సులను సేకరిం చి, రాష్ట్రాలకు పంపిణీ చేయనుంది. మొదటి దశ టెండ ర్‌లో 5,450 విద్యుత్ బస్సులకు టెండర్లు పిలిచిన సంస్థ, రెండో దశలో ఇప్పటికే 5,690 బస్సులకు టెండర్లు పిలిచింది.