Thursday, November 21, 2024

పెరుగుతున్న దేశీయ విమాన ప్రయాణికులు

దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య వార్షిక ప్రాతిపదికన 5.1 శాతం పెరిగింది. మే నెలలో దేశీయ ప్రయాణికుల సంఖ్య 13.89 కోట్లుగా నమోదైంది. ఇది కోవిడ్‌ ముందు స్థాయి కంటే ఇది 14 శాతం ఎక్కువని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. భారత విమానయాన రంగం స్థిరంగా వృద్ధిని కొనసాగిస్తోందని ఇక్రా తెలిపింది.

దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల ట్రాఫిక్‌ కూడా స్థిరంగా పెరుగుతోందని, ఇది 2024-25 ఆర్ధిక సంవత్సరంలోనూ కొనసాగుతుందని తెలిపింది. మే నెలలో విమానయాన సంస్థల సామర్ధ్యం గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 6 శాతం పెరిగిందని, ఏప్రిల్‌ కంటే ఇది 2 శాతం అధికగమని తెలిపింది.

2023-24 ఆర్ధిక సంవత్సరంలో దేశీయ విమానయాన ప్రయాణికుల సంఖ్య 15.4 కోట్లుగా ఉన్నట్లు ఇక్రా తెలిపింది. అంతకు ముందు సంవత్సరం కంటే ఇది 13 శాతం ఎక్కువ. కోవిడ్‌ కంటే ముందు దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 14.2 కోట్లుగా ఉంది. ఈ సంఖ్యను ప్రస్తుతం విమానయాన సంస్థలు అధికమించాయి.

భారత్‌ నుంచి అంతర్జాతీయ ప్రయాణికులు 2023-24లో 2.96 కోట్లుగా ఉన్నారు. అంతకు ముందు సంవత్సరం కంటే ఇది 24 శాతం ఎక్కువ. కోవిడ్‌ కాలం ముందు కంటే ప్రస్తుతం టికెట్‌ ధరలు పెరిగాయని తెలిపింది. విమానయాన సంస్థల నిర్వహణలో విమాన ఇంధనం ఏటీఎఫ్‌ ధరలు ఎయిర్‌ క్రాఫ్ట్‌ లీజ్‌ చెల్లింపులు, ఇంజిన్‌, విమానాల నిర్వహణ వ్యయాలు 45-60 శాతం వరకు ఉంటాయని ఇక్రా తెలిపింది.

విమానయాన ఇండస్ట్రీ 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 170-175 బిలియన్‌ డాలర్ల నష్టాన్ని ఎదుర్కొన్నాయి. విమాన ఇంధన ధరలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గం మూలంగా ఎక్కువ నష్టాలు నమోదైనట్లు తెలిపింది. చాలా విమానయాన సంస్థల రుణాలు డాలర్‌ టర్మ్‌లో ఉంటున్నాయి. దీని వల్ల రూపాయి విలువ తగ్గితే రుణ భారం పెరుగుతోంది.

- Advertisement -

2023-24 ఆర్ధిక సంవత్సరం మాదిరిగానే 2024-25 ఆర్ధిక సంవత్సరంలో విమానయాన సంస్థలు 30-40 బిలియన్‌ డాలర్ల నికర నష్టాన్ని నమోదు చేసే అవకాశం ఉందని ఇక్రా అంచనా వేసింది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో నమోదు చేసిన నికర నష్టం 70-175 బిలయన్‌ డాలర్లతో పోల్చితే ఇది చాలా తక్కువని ఇక్రా తెలిపింది. విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడంతోనే విమానయాన సంస్థల నష్టాలు కూడా అదే స్థాయిలో తగ్గుతున్నాయని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement