Tuesday, November 26, 2024

టీవీలు, ఫ్రిడ్జ్‌లకు పెరుగుతున్న డిమాండ్‌.. అమ్మకాల్లో 18 శాతం వృద్ధి

దేశంలో వినియోగ వస్తువుల పరిశ్రమ 15 నుంచి 18 శాతం వృద్ధి చెందనుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ పరిశ్రమ దేశంలో లక్ష కోట్ల రూపాయల బిజినెస్‌ చేయనుందని ఒక అంచనా. ప్రధానంగా స్మార్ట్‌ టీవీలు, పెద్ద ఏసీలు, రిఫ్రిజిరేటర్స్‌, వాషింగ్‌ మెసిన్స్‌ అమ్మకాలు భారీగా ఉంటాయని తెలిపింది. ఈ డిమాండ్‌ పట్టణ ప్రాంతాలతో పాటు, గ్రామీణ ప్ర్‌ాంతాల్లోనూ పెరుగుతుందని పేర్కొంది. ఈ పరిశ్రమ ఆదాయం 15 నుంచి 18 శాతం, అమ్మకాలు 10 నుఏంచి 13 శాతం పెరుగుతాయని క్రిసల్‌ తెలిపింది.

ప్రధానంగా ఏసీల అమ్మకాలు పరిశ్రమ వృద్ధికి ఎక్కువ దోహదం చేస్తాయని క్రిసల్‌ డైరెక్టర్‌ పుశాన్‌ శర్మ తెలిపారు. దేశంలో మారుతున్న వాతావరణ పరిస్థితులతో ఏసీలు, ప్రిడ్జ్‌ల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. టీవీల విషయంలో వినియోగదారులు పెద్ద స్క్రీన్‌ ఉన్న వాటిని కోరుకుంటున్నారని ఆయన వివరించారు. ఈ రంగంలో ఉన్న 8 కంపెనీల నుంచి సగానికి పైగా పరిశ్రమ ఆదాయం వస్తుందని క్రిసిల్‌ అంచనా వేసింది. ముడి సరకుల ధరలు పెరగడంతో మార్జిన్లు తగ్గుతున్నాయని పేర్కొంది. ప్రధానంగా కాపర్‌, అల్యూమినియం, పాలీప్రాపిలైన్‌ వంటి వాటి ధరలు పెరిగాయని, రూపాయి క్షిణత వంటి అంశాలు కూడా మార్జిన్లపై ప్రభావం చూపుతున్నాయని, కంపెనీలు ఈ ఖర్చును కస్టమర్లపైకి నెట్టేందుకు అవకాశం కూడా లేదని పేర్కొంది.

రేట్లు పెరగలేదు

కన్జ్యూమర్‌ గూడ్స్‌ ధరలు అంతగా పెరగలేదు. మార్కెట్‌లో తీవ్రమైన పోటీ ఉండటం ఇందుకు ప్రధాన కారణం. గత రెండు నెలల కాలంలో వీటి ధరలు తగ్గుతూ వచ్చాయి. ముడి సరుకుల్లో 45 నుంచి 50 శాతం వరకు దిగుమతి చేసుంటున్నారు. డాలర్‌తో రూపాయి విలువ క్షిణించడం వల్ల కూడా దిగుమతులపై ప్రభావం పడుతోంది. కొవిడ్‌ సమయంలో అమ్మకాలు క్షిణించడం వల్ల ప్రస్తుతం పరిస్థితుల్లో వాటిని పెంచుకోవడంపైనే కంపెనీలు ప్రధానంగా దృష్టి పెట్టాయి. ఈ స్థితిలో కంపెనీలు రేట్లు పెంచడం మంచిదికాదని భావిస్తున్నాయి. దీని వల్ల కంపెనీల లాభాల్లో క్షిణత ఏర్పడింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పరిస్థితిలో మార్పు రావచ్చని క్రిసిల్‌ అంచనా వేసింది.

పెరుగుతున్న డిమాండ్‌

- Advertisement -

ఆ ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల నుంచి వినియోగ వస్తువులకు మొదటి ఆరు నెలల తరువాతే వచ్చే అవకాశం ఉంది. అప్పటికి చాలా మంది రైతులకు పంటలు చేతికి వస్తాయి. మార్కెట్‌లో వాటిని విక్రయిస్తారు. ఆ సమయంలోనే వారు వీటిని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తారని అంచనా వేసింది. ఇప్పటికే వినియోగ వస్తువుల మార్కెట్‌ కొవిడ్‌ ప్రభావం నుంచి బయటపడిందని, ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో పురోగతి సాధిస్తుందని పుశాన్‌ శర్మ అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement