పైపుల ద్వారా ఇళ్లకు సరఫరా చేసే కుకింగ్ గ్యాస్, సీఎన్జీ ధరలను 3 రూపాయలు పెంచారు. ఇటీవలే ఈ గ్యాస్ ఉత్పత్తి ధరను ప్రభుత్వం పెంచడంతో రిటైల్ ధరలను కూడా పెంచారు. సీఎన్జీ గ్యాస్ ధరను కేజీకి 3 రూపాయల చొప్పున పెంచారు. పైపుల ద్వారా ఇళ్లసు సరఫరా చేసే సహజ వాయువు (పీఎన్‌జీ) ధరలను స్టాండర్డ్ క్యూబిక్ మీటర్‌కు 3 రూపాయల చొప్పున పెంచారు.
దేశ రాజధాని ఢిల్లిలో ధరలు పెంచిన తరువాత సీఎన్జీ ధర కేజీకి 75.61 రూపాయల నుంచి 78.61 రూపాయలకు పెరిగింది. మార్చి 7 తరువాత ఇప్పటి వరకు సీఎన్జీ ధరను 14 సార్లు పెంచారు.
చివరిసారి ఈ సంవత్సరం మే 21న కేజీకి 2 రూపాయలు పెంచారు. మార్చి 7 నుంచి ఇప్పటి వరకు సీఎన్జీ గ్యాస్ ధర 22.60 రూపాయలు పెరిగింది. 2021 ఏప్రిల్ నుంచి చూస్తే సీఎన్జీ ధర కేజీకి 35.21 రూపాయలు పెరిగింది. అంటే 80 శాతం ధర పెరిగింది. గతంలో ఎన్నడూ ఒక సంవత్సర కాలంలో ఇంత భారీగా సీఎన్జీ ధర పెరగలేదు. పైపుల ద్వారా ఇళ్లకు సరఫరా చేసే సహజ వాయువు ధరలు 2021 ఏప్రిల్ నుంచి 10 సార్లు పెంచారు. ఈ మొత్తం కలిపితే 29.93 రూపాయలు పెరిగింది. దీని ధర 91 శాతం పెంచినట్లైంది. ఢిల్లిdలో ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ కంపెనీ సీఎన్జీ, పైపుడ్ గ్యాస్‌ను సరఫరా చేస్తుంది.
ఈ కంపెనీ సరఫరా చేస్తున్న ఇతర నగరాలైన నోయిడా, గ్రేటర్ నోయిడా, గజియాబాద్, గుర్గావ్, కాన్పూర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లోని ఆజ్మీర్ లో కూడా పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని ఈ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కొద్దిరోజుల క్రితమే ప్రభుత్వం సహజ వాయువు ధరను ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ ధరను 40 శాతం పెంచింది. యూనిట్‌కు 8.57 డాలర్లు పెంచింది. సీఎన్జీ గ్యాస్‌ను ఆటో మొబైల్స్‌కు, ఇళ్లకు పైపుల ద్వారా సరఫరా చేస్తున్నారు.
మరో గ్యాస్ కంపెనీ మహానగర్ గ్యాస్ లిమిటెడ్ సైతం వీటి ధరలను పెంచింది. ఈ కంపెనీ ముంబై, దాని సమీప ప్రాంతాలకు సీఎన్జీ గ్యాస్‌ను సరఫరా చేస్తోంది. కేజీకి 6 రూపాయలు పెం చడంతో ధర 86 రూపాయలకు చేరింది. పైపుడ్ గ్యాస్ ధరను యూనిట్‌కు 4 రూపాయలు పెంచడంతో దీని ధర 52.50కు చేరింది. గ్యాస్ ధరలు ఒక్క సంవత్సరంలోనే 5 రేట్లు పెరిగాయి. 2021 సెప్టెంబర్‌లో సహజ వాయువు గ్యాస్ ధర కేజీకి 1.79 డాలర్లు ఉంటే, ప్రస్తుతం అది 8.57 డాలర్లకు చేరింది. ఆయా పట్టణాల్లో ఉన్న స్థానిక పన్నులు కలిపితే ఇది మరింత ఎక్కువగా ఉంటుంది.