Saturday, November 23, 2024

పెరిగిన జియో, ఎయిర్‌టెల్‌ చందాదారులు

రిలయన్స్‌ జియో కొత్త యూజర్లను చేర్చుకోవడంలో అగ్రస్థానంలో ఉంది. జులైలో కొత్తగా 29 లక్షల మంది కొత్త చందాదారులు జియోలో చేరారు. ఎయిర్‌టెల్‌లో 5 లక్షల మంది కొత్త చందాదారులు చేరారు. జులై నెలకు సంబంధించిన చందాదారుల వివరాలను టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ విడుదల చేసింది. ఇదే సమయంలో వొడాఫోన్‌ ఐడియా 8 లక్షల మందిని, బీఎస్‌ఎన్‌ఎల్‌ 15 లక్షల మంది చందాదారులను కోల్పోయాయి. ఎంటీఎన్‌ఎల్‌ చందాదారుల సంఖ్య కూడా 4 లక్షలు తగ్గింది.
జులైలో జియో, ఎయిర్‌టెల్‌ చందాదారుల సంఖ్య పెంచుకున్నప్పటికీ, యాక్టివ్‌ యూజర్ల సంఖ్య మాత్రం తగ్గింది. వీటితో పాటు మిగిలిన టెలికాం కంపెనీలకు కూడా యాక్టివ్‌ యూజర్ల సంఖ్య తగ్గిందని ట్రాయ్‌ విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
జున్‌లో జియోకు 38.32 కోట్ల ంది యాక్టివ్‌ యూజర్లు ఉంటే, జులైలో ఆ సంఖ్య 38.21 కోట్లకు తగ్గింది. 11 లక్షల యాక్టివ్‌ యూజర్ల సంఖ్య తగ్గింది. ఎయిర్‌టెల్‌ యాక్టివ్‌ యూజర్ల సంఖ్య 35.72 కోట్ల నుంచి 35.61 కోట్లకు తగ్గింది. ఎయిర్‌టెల్‌కు కూడా 11 లక్షల మంది యాక్టివ్‌ యూజర్లు తగ్గిపోయారు.

వోడాఫోన్‌ ఐడియా యాక్టివ్‌ యూజర్ల సంఖ్య 21.86 కోట్ల నుంచి 21.69 కోట్లకు తగ్గారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ యాక్టివ్‌ యూజర్ల సంఖ్య 5.77 కోట్ల నుంచి 5.72 కోట్లకు తగ్గారు. ఇలా యాక్టివ్‌ యూజర్ల స ంఖ్య తగ్గడం వల్ల కంపెనీలకు ఒక వ్యక్తిని వచ్చే సగటు ఆదాయం పై ప్రభావం పడుతుంది. అన్ని టెలికాం కంపెనీలు గత సంవత్సరం ఛార్జీలు పెంచాయి. ప్యాకేజీల వ్యవధిలోనూ మార్పులు చేశాయి. దీని వల్లే రీఛార్జి చేసే వారి సంఖ్య తగ్గుతుందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఒక వైపు చందాదారుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, యాక్టివ్‌ యూజర్ల సంఖ్య తగ్గుతుండటం పట్ల టెలికాం కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. 5జీ వస్తే ఇలాంటి వారి సంఖ్య పెరుగుతుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. 5జీ సర్వీస్‌లకు టెలికాం కంపెనీలు ప్రకటించే ఛార్జీలపై ఇది ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement