Saturday, November 23, 2024

పెరిగిన గృహ రుణాలు.. వడ్డీ రెట్లు పెరుగుతున్నా 15 శాతం వృద్ధి

దేశంలో గృహ రుణాలు పెరుగుతున్నాయి. గత ఆర్ధిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం నియంత్రణ కోసం రిజర్వ్‌ బ్యాంక్‌ పలుమార్లు వడ్డీరేట్లను పెంచింది. దీనికి అనుగుణంగా అన్ని బ్యాంక్‌లు రుణా వడ్డీరేట్లను పెంచాయ. 2022 మార్చి చివరి నాటికి దేశంలో గృహ రుణాలు 16.84 లక్షల కోట్లుగా ఉంటే, 2023 మార్చి నాటికి 15 శాతం వృద్ధితో 19.36 లక్షల కోట్లకు చేరాయని ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2021 మాచ్చి చివరి నాటికి గృహ రుణాలు 14.92 లక్షల కోట్లుగా ఉన్నాయి. వీటితో పోలిస్తే 2022 మార్చి నాటికి 12.9 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది.

మే 2022 నుంచి ఇప్పటి వరకు ఆర్బీఐ ప్రామాణిక రేటును 250 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీంతో అన్ని బ్యాంక్‌లు గృహ రుణాలతో పాటు అన్ని రకాల రుణాల వడ్డీ రేట్లను పెంచాయి. పెరిగిన వడ్డీ రేట్ల ప్రభావం గృహ రుణాలపై అంతగా పడలేదు. గత సంవత్సరం మార్చి నాటికి వ్యక్తిగత రుణాలు వార్షిక ప్రాతిపదికన చూస్తే 20.6 శాతం పెరిగాయి. ఇందులో గృహ రుణాలదే ఎక్కువ వాటా. గృహ రుణాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అడ్వాన్స్‌లు, క్రెడిట్‌ కార్డు, విద్య, వాహన రుణాలన్నీ వ్యక్తిగత రుణాల కిందకే వస్తాయి.

- Advertisement -

కంపెనీలకు ఇచ్చే రుణాలు కూడా అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం మార్చి నాటికి 5.7 శాతం పెరిగాయి. 2022 మార్చిలో ఇది 7.5 శాతం వృద్ధి చెందాయి. పరిమాణం పరంగా చూస్తే గత సంవత్సరం మార్చిలో పెద్ద పరిశ్రమలకు 3 శాతం రుణాలు ఇచ్చారు. ఇది గత సంవత్సరం 2 శాతంగా ఉంది. మధ్యస్థాయి పరిశ్రమలకు 19.6 శాతం, సూక్ష్మ, చిన్నస్థాయి పరిశ్రమలకు 12.3 శాతం మేర రుణాలు పెరిగాయి. సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి సంస్థలకు ఇచ్చే రుణాల వృద్ధి తగ్గింది. వ్యవస్థాయం,అనుబంధ రంగాలకు ఇచ్చే రుణాలు 15.4 శాతంగా ఉన్నాయి. 2022 మార్చి నాటికి ఇవి 9.9 శాతంగా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement