Wednesday, November 20, 2024

రష్యా నుంచి పెరిగిన బొగ్గు దిగుమతులు..

రష్యా నుంచి మన దేశం భారీగా బొగ్గు దిగుమతి చేసుకుంటోంది. అమెరికా, యూరోపియన్‌ దేశాల ఆంక్షలు ఉన్నప్పటికీ ఈ దిగుమతులు పెరుగుతున్నాయి. రష్యా నుంచి సభ్య దేశాలు బొగ్గు దిగుమతి చేసుకోకుండా యూరోపియన్‌ యూనియన్‌ ఆంక్షలు విధించింది. బొగ్గు కొనుగోలుపై రష్యా 30 శాతం వరకు డిస్కౌంట్‌ ఇస్తోంది. ఫలితంగా మన దేశంలోని స్టీల్‌, షుగర్‌ ఇండస్ట్రీకి చెందిన పలు కంపెనీలు రష్యా నుంచి భారీగా బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాయి. ఆంక్షలు ఉన్నప్పటికీ రష్యా నుంచి మనం చమురు దిగుమతులు చేసుకుంటున్నాం. అమెరికా దీనిపై పలు మార్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ మనం దిగుమతుల కొనసాగిస్తున్నాం. రష్యాతో మన దేశానికి రాజకీయ, ఆర్థిక, వాణిజ్య పరమైన అనేక ఒప్పందాలు ఉన్నాయి. వీటి వల్లే ఆంక్షలు ఉన్నా మన దేశం , బొగ్గు, ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. రష్యా నుంచి దిగుమతులను మన దేశం గట్టిగా సమర్దించుకుంది. రష్యా నుంచి ఇంధన దిగుమతుల విషయంలో భారత్‌పై నేరుగా ఎలాంటి ఆంక్షలు లేనప్పటికీ, ఇలా భారీగా దిగుమతి చేసుకోవడం పట్ల అభ్యంతరాలు ఉన్నాయని అమెరికా స్పష్టం చేసినట్లు రాయిటర్స్‌ ఒక వార్త కథనంలో పేర్కొంది. గత 20 రోజుల్లో బొగ్గు ది గుమతులు గత సంవత్సరంతో పోల్చితే ఆరు రేట్లు పెరిగట్లు రాయిటర్స్‌ తెలిపింది. గత సంవత్సరం ఇదే కాలంలో బొగ్గు దిగుమతులు 331.17 మిలియన్‌ డాలర్లుగా ఉంది. అదే సమయంలో రష్యా నుంచి మన దేశం ఆయిల్‌ దిగుమలు 31 శాతం పెరిగి 2.22 బిలియన్‌ డాలర్లకు చేరింది.

- Advertisement -

మన దేశానికి రష్యా ఆయిల్‌ను తగ్గింపు ధరలో అందిస్తోంది. రూపాయల్లో, లేకుంటే యూఏఈ కరెన్సీలో చెల్లించడానికి అంగీకరించింది. ఇది మన దేశానికి ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. మంచి డిస్కౌంట్‌ లభిస్తున్నందున ఈ కొనుగోళ్లు ఇంకా పెరుగు తాయని వాణిజ్య వర్గాలు వెల్లడించాయి. రష్యా నుంచి రవాణా ఖర్చు కొంచెం అధికంగా ఉన్నప్పటికీ, రష్యా ఇస్తున్న డిస్కౌంట్‌ మూలంగా దిగుమతులు అంతకంతకూ పెరుగుతున్నాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు నుంచి రష్యా బొగ్గును సభ్య దేశాలు దిగుమతి చేసుకోకుండా ఈయూ నిషేధం విధించింది. ప్రస్తుతం అమల్లోఉన్న ఒప్పందాలను కూడా ఆగస్టులో రద్దు కానున్నాయి. మన దేశం ఈ నెల 16 వరక సరాసరిగా రోజుకు 16.55 మిలియన్‌ డాలర్ల విలువైన బొగ్గును దిగుమతి చేసుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన సమయంలో మన దిగుమతులు రోజుకు 7.71 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. మే 26 నాటికి మన దేశం సగటున రోజుకు రష్యా నుంచి 31.16 మిలియన్‌ డాలర్ల విలువైన చమురును దిగమతి చేసుకునేది. ప్రస్తుతం ఇది రోజుకు 110.86 మిలియన్‌ డాలర్లకు పెరిగింది. రష్యా నుంచి భారత దేశానికి బొగ్గు, చమురు దిగుమతులు మరింత పెరిగే సూచనలు ఉన్నాయని రాయిటర్స్‌ తన కథనంలో పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement