Sunday, November 17, 2024

భారీగా వ‌సూలు కానున్న‌ ఆదాయ‌పు ప‌న్ను.. అంచ‌నా వేస్తున్న అధికారులు

ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నుల వసూళ్లు అంచనాలకు మించి నమోదయ్యే అవకాశం ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే , 2021-22 ఆర్థిక సంవత్సరంలో పరోక్ష పన్నులు 20 శాతం, ప్రత్యక్ష పన్నులు 49 శాతం అధికంగా వసూలయ్యాయని కేంద్ర రెవెన్యూ కార్యద ర్శి తరుణ్‌ బజాజ్‌ తెలిపారు. జీడీపీలో ప న్నుల నిష్పత్తి 11.7 శాతానికి చేరింది. 1999 తరువాత లక్ష్యానికి మించి పన్నులు వసూలు కావడం ఇదే ప్రథమం. బడ్జెట్‌లో పన్నుల వసూళ్లు 22.17 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఇప్పుడు వసూలైంది 27.07 లక్షల కోట్లు.

అంచనా కంటే 5 లక్షల కోట్లు అధనంగా వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌లో ఉన్నామని , పన్నుల వసూళ్లు ఆశాజనకంగానే ఉండే సూచనలు ఉన్నాయని తరుణ్‌ బజాజ్‌ చెప్పారు. కస్టమ్స్‌ సుంకాల్లో , ఎక్సైజ్‌ సుంకాల్లో కొన్ని రాయితీలు, తగ్గింపులు ఉన్నప్పటికీ… లక్ష్యం మేర పన్నుల వసూళ్లు ఉంటాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. జీఎస్టీ వసూళ్లులో మంచి వృద్ధి కనిపిస్తోందని, ప్రతినెలా లక్షా 40 వేల నుంచి లక్షా 50 వేల కోట్ల వరకు వసూళ్లు వస్తున్నాయని వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement