Friday, November 22, 2024

త్రైమాసిక ఆర్ధిక ఫలితాల్లో మారుతీ సుజుకీ సత్తా… 80 శాతం పెరిగిన నికర లాభం

దేశీయ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ త్రైమాసిక ఆర్ధిక ఫలితాల్లో సత్తా చాటింది. ఈ ఆర్ధిక సంవత్సరం జులై- సెప్టెంబర్‌ త్రైమాసికంలో అంచనాలను మించి ఫలితాలను నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో కంపెనీ 3,716 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన నికర లాభాంతో పోల్చితే ఇది 80.3 శాతం అధికం.

గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం 2061.5 కోట్లుగా ఉంది. అమ్మకాల్లో వృద్ధి, ఆపరేటింగ్‌తేయర ఆదాయాలు పెరగడం, కమొడిటీ ధరలు తగ్గడం వల్ల కారణాలతో లాభాలు పెరిగినట్ల కంపెనీ తెలిపింది. మారుతీ సుజుకీ కంపెనీ మొత్తం ఆదాయం కూడా భారీగానే పెరిగింది. ఈ త్రైమాసికంలో కంపెనీ 35,535.1 కోట్ల రూపాయల ఆదాయాన్ని నమోదు చేసింది.

గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆదాయం 28,543.50 కోట్లుగా ఉంది. మారుతీ సుజుకీ ఈ త్రైమాసికంలో 5,52,055 యూనిట్లు అమ్మకాలు జరిపింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 5,17,395యూనిట్లను విక్రయించింది. ఇందులో దేశీయంగా 4,82,71 యూనిట్లను విక్రయించగా, 69,324 యూనిట్లను ఎగుమతి చేసింది.

- Advertisement -

చిన్న కార్లు మళ్లి డిమాండ్‌ : ఛైర్మన్‌

ఇండియన్‌ మార్కెట్‌లో చిన్న కార్లకు డిమాండ్‌ మళ్లి తిరిగి వస్తుందని మారుతీ సుజుకీ ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ అభిప్రాయపడ్డారు. ఆర్ధిక వ్యవస్థ వృద్ధి వేగంగా ఉండటం, ఆదాయాలు పెరగడంతో పెద్ద కార్లు ముఖ్యంగా ఎస్‌యూవీలకు డిమాండ్‌ ఎక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీని వల్ల ప్రస్తుతం చిన్న కార్ల అమ్మకాలు భారీగా తగ్గాయని, ఇది క్రమంగా పోతుందని, రానున్న రెండుమూడు సంవత్సరాల్లో మళ్లి చిన్ను కార్లకు డిమాండ్‌ పెరుగుతుందని ఆయన చెప్పారు.

గతంలో ఎన్నడూ లేనంగా ఎక్కువగా ఎస్‌యవీలకు డిమాండ్‌ పెరగడంతో మొత్తం కార్ల అమ్మకాల్లో 60 శాతంగా ఉన్న చిన్న కార్ల వాటా ప్రస్తుతం 30 శాతానికి తగ్గింది. దేశంలో 18 లక్షల మంది టూ వీలర్స్‌ యజమానులు రానున్న రోజుల్లో చిన్న కార్ల కొనుగోలుకు కస్టమర్లుగా ఉంటారని ఆయన చెప్పారు. రానున్న సంవత్సరాల్లో ఎంట్రీ లెవల్‌ కార్లకు క్రమంగా మళ్లి డిమాండ్‌ పెరుగుతుందన్నారు.

2023-24 ఆర్ధిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహనాల సిగ్మెంట్‌ 5.5 శాతం వృద్ధి నమోదు చేస్తుందని అంచనా ఆయన అంచనా వేశారు. మారుతీ సుజుకీ 10 శాతం వృద్ధి సాధిస్తుందని చెప్పారు. వచ్చే సంవత్సరంలో అమ్మకాలు పెరుగుతాయని పరిశ్రమ భావించడంలేదన్నారు. ఎంట్రీ లెవల్‌ సిగ్మెంట్‌ కార్ల అమ్మకాలు పెరగకుండా, అధిక వృద్ధి నిలదొక్కుకోవడం సాధ్యం కాదన్నారు. గ్రామీణ మార్కెట్‌ నుంచి డిమాండ్‌, పట్టణ ప్రాంతాల కంటే 10-11 శాతం వరకు ఎక్కువగా ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement