దేశంలోనే అతి పెద్ద ఇంజినీరింగ్,కనస్ట్రక్చన్ కంపెనీగా ఉన్న లార్సెన్ అండ్ టూబ్రో లిమిటెడ్ (ఎల్ అండ్ టీ) రానున్న 5 సంవత్సరాల్లో 12 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. కంపె నీ తన క్లీన్ ఎనర్జీ బిజినెస్‌ను భారీగా విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 4 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 2-3 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో గ్రీన్ హైడ్రోజన్, అమోనియా ప్లాంట్‌ను నిర్మించనుంది. హైడ్రోజన్ ప్లాంట్‌న నిర్మాణానికి కావాల్సిన 500-1000 ఎకరాల భూమి కోసం కంపెనీ కొన్ని తీర ప్రాంత రాష్ట్రాలన సంప్రదించింద ని కంపెనీ సీఈఓ ఎస్‌ఎన్ సుబ్రమణ్యన్ ముంబైలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఏఎం నాయక్ రిటైర్ అయిన తరువాత గత అక్టోబర్‌లో ఆయన ఎల్ అండ్ టీ గ్రూప్ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు. రీన్యూ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి పునరుత్పాదక శక్తిని ఉపయోగించి నడిచే ఎలక్ట్రోలైజర్‌లను డిసెంబర్‌లో తయారు చేయడంతో హైడ్రోజన్ ఉత్పత్తి ప్రయత్నాలు ప్రారంభం అవుతాయి. పానిపట్‌లోని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ రిఫైనరీలో గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయనుంది.
ఈ ప్రాజెక్ట్ మరిన్ని ఇండియన్ ఆయిల్ రిఫైనరీలు, ఇతర ఎల్ అండ్ టీ కస్టమర్లకు విస్తరించనుంది. ముంబై కేంద్రంగా పని చేస్తున్న రీన్యూ పవర్ ప్రైవేట్ లిమిడెట్ రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీలతోనూ గ్రీన్ ఎనర్జీ విషయంలో పని చేస్తోంది. ప్రస్తుతం ఉన్న ధరల్లో భారీగా హైడ్రోజన్ ఉత్పత్తి చేయడం ఆచరణ సాధ్యం కాదని సుబ్రమణియన్ అభిప్రాయపడ్డారు.
ధరలు తగ్గితే ఎల్ అండ్ టీ ఈ రంగంలో తన పెట్టుబడులను మరింత వేగంగా పెడుతుందన్నారు. ఎల్ అండ్ టీకి అనుబంధంగా ఉన్న ఎల్ అండ్ టీ ఎనర్జీ గ్రీన్ టెక్ సంస్థ ఈ ప్రాజెక్ట్‌లను చేపడుతుంది. ఈ సంస్థ క్రమంగా ప్యూయల్ సెల్స్, గ్రిడ్ బ్యాటరీలు, హైడ్రజన్ విక్రయాలకు విస్తరించనుందని ఆయన చెప్పారు. మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో ఎల్ అండ్ 23 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది.