ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా డిపాజిట్ పథకాలను ప్రారంభించింది. బరోడా తిరంగా పేరిట ప్రారంభించిన ఈ డిపాజిట్ పథకంలో రెండు కాలవ్యవధిలో లభిస్తాయి. 444 రోజుల వ్యవధిలో చేసే డిపాజిట్లపై సంవత్సరానికి 5.75 శాతం వడ్డీ ఇస్తారు. రెండోవది 555 రోజుల వ్యవధిలో చేసే డిపాజిట్ పథకంపై 6 శాతం వడ్డీ ఇవ్వనున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. ఈ పథకం ఆగస్టు 16 నుంచి డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుంది. 2 కోట్ల కంటె తక్కువ చేసే డిపాజిట్లకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపింది. సీనియర్ సిటిజన్లకు వీటిపై అదనంగా 0.50 శాతం అదనపు వడ్డీని చెల్లిస్తామని బ్యాంక్ తెలిపింది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలైన సందర్బంగా ఈ కొత్త డిపాజిట్ పథకాన్ని తీసుకు వచ్చినట్లు తెలిపింది.
ఎస్‌బీఐ ఉత్సవ్ డిపాజిట్ పేరిట డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో వెయ్యి రోజుల కాల వ్యవధితో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సంవత్సరానికి 6.10 శాతం వడ్డీ రేటును ఇవ్వనున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం వడ్డీ పొందుతారని తెలిపింది. ఆగస్టు 15 నుంచి ప్రారంభం అయిన ఈ పథకం 75 రోజల పాటు అమల్లో ఉంటుందని ఎస్‌బీఐ తెలిపింది.