Monday, September 16, 2024

Wikipedia | భారత్‌ ఇష్టం లేకుంటే ఇక్కడ పనిచేయకండి..

ప్రముఖ ఆన్‌లైన్‌ ఎన్‌సైక్లోపీడియా సంస్థ వికీ పీడియాకు ఢిల్లి హైకోర్టు గురువారం ధిక్కార నోటీసులు జారీచేసింది. ఆంగ్ల వార్తా సంస్థ నమోదు చేసిన సవరణలకు సంబంధించిన సమాచారాన్ని నిలిపివేయడంపై న్యాయస్థానం ఆక్షేపించింది. భారతీయ చట్టాలను పాటించక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేసింది. మీకు ఇండియా నచ్చకుంటే, ఇక్కడ పనిచేయకండి.. మీ సైట్‌ను బ్లాక్‌ చేయమని ప్రభుత్వానికి సూచిస్తాం అంటూ హెచ్చరించింది.

ఏఎన్‌ఐ సమాచారంతో కూడిన పేజీలో సవరణలు చేసిన మూడు ఖాతాల గురించి వివరాలు వెల్లడించాలని వికీపీడియాను కోర్టు ఆదేశించింది. అయితే ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు మావైపు అందాల్సి ఉందని, మా సంస్థ ఇండియాది కాదు కాబట్టి జాప్యం జరుగుతోందని వికీపీడియా కోర్టుకు నివేదించింది. ఈ

ప్రకటనపై జస్టిస్‌ నవీన్‌ చావ్లా అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రతివాది భారతదేశంలోని సంస్థ ఔనా? కాదా? అన్నది ఇక్కడ ప్రశ్నకాదు. మీరు ఇలాగే వ్యవహరిస్తామంటే మీ బిజినెస్‌ను మూసివేయమని ప్రభుత్వానికి ఆదేశాలిస్తాం. ఇంతకు ముందు కూడా మీరు ఇలాగే వ్యవహరించారు.

మీకు భారతదేశం నచ్చకుంటే, దయజేసి ఇక్కడ పనిచేయకండి అని కోర్టు తేల్చిచెప్పింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్‌కు వాయిదా వేసింది. తదుపరి విచారణకు కంపెనీ ప్రతినిధి కూడా హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. కంటెంట్‌ ఎడిట్‌కు సంబంధించిన ఈ కేసులో వికీపీడియా నుంచి ఏఎన్‌ఐ రూ.2 కోట్లు నష్టపరిహారం కోరుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement