అసలు ఖాతాలపై స్పష్టతనిస్తూ దానికి సంబంధించిన ఆధారాలు చూపిస్తే 44 బిలియన్ డాలర్ల కొనుగోలు ఒప్పందంపై ముందుకు వెడతామని ఎలన్ మస్క్ ట్విట్టర్ యాజమాన్యానికి సరికొత్త ప్రతిపాదన చేశారు. అందుకోసం ఆయన ఓ ప్రతిపాదన చేశారు. కనీసం వంద అక్కౌంట్లను పరిశీలించి, వాటిలో అసలైన ఖాతాలు ఎన్నో పసిగట్టడం ద్వారా ట్విట్టర్ ఖాతాల విశ్వసనీయతను పరీక్షించాలని అనుకుం టున్నట్లు మస్క్ పేర్కొన్నారు. తన ప్రతిపాదనను ట్విట్టర్ అమలు చేసి ఫలితాలు చూపిస్తే ఒప్పందంపై ముందుకు వెళ్లడానికి సంసిద్ధమేనని స్పష్టం చేశారు.
ఒకవేళ ఆ వంద అకౌంట్లలో నకిలీ ఖాతాలున్నట్లు తేలితే ఒప్పందానికి స్వస్తి చెబుతామని వెల్లడించారు. ఒక ట్విట్టరాటీ వేసిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ తన అభిప్రాయాన్ని పోస్టు చేశారు. దీనిపై స్పందించడానికి ఆ సామాజిక దిగ్గజం నిరాకరించింది. కొనుగోలు ఒప్పందంపై మస్క్ వెనక్కు తగ్గిన నేపథ్యంలో ట్విట్టర్ కోర్టును ఆశ్రయించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.