హైదరాబాద్ : ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంక్ యువత కోసం తమ క్రెడిట్ కార్డ్ ఆఫర్‌ను విస్తరిస్తూ ఫస్ట్ స్వైప్ క్రెడిట్ కార్డ్‌ను పరిచయం చేసింది. నేటి జెన్ జెడ్ జనరేషన్ కోసం రూపొందించబడిన ఈ కార్డ్, తమ ఫీచర్ మర్చంట్స్ అండ్ ఈఎంఐ ప్రయోజనాలను కార్డు హోల్డర్‌లకు అందించటంతో పాటుగా పూర్తి చెల్లింపు సౌలభ్యం, అనేక రెఫరల్ ప్రయోజనాల ద్వారా అద్భుతమైన జీవనశైలికి సంబంధించిన ఆఫర్‌లను అందించడానికి కార్డ్ రూపొందించబడింది. ఈ సందర్భంగా ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంక్ లోని క్రెడిట్ కార్డు బిజినెస్ హెడ్ శిరీష్ భండారి మాట్లాడుతూ… యువత కోసం నూతన ఆవిష్కరణలు, సంబంధిత కొత్త ఉత్పత్తులను రూపొందించడంలో తమ నిబద్ధతను నిజంగా ప్రతిబింబించే ఫస్ట్ స్వైప్ క్రెడిట్ కార్డ్‌ను విడుదల చేయడం పట్ల తాము సంతోషిస్తున్నామన్నారు.
ఈ కార్డ్ క్రెడిట్ కార్డ్ వినియోగంతో యువత సంబంధాన్ని పునరుజ్జీవింప జేస్తుందన్నారు. ఇది వడ్డీ రహిత కార్డ్‌గా ఉపయోగించబడే దాని స్వాభావిక సామర్ధ్యం కారణంగా, అలాగే ఈఎంఐల ద్వారా ఫ్లెక్సిబుల్ బిల్ రీపేమెంట్‌లు వంటి స్మార్ట్‌గా క్యూరేట్ చేయబడిన ఫీచర్‌లు, శక్తివంతమైన, ప్రయోజనం కలిగించే రిఫరల్ ప్రోగ్రామ్, ఇది సామాజిక అనుసంధానాన్ని మెరుగు పరచడానికి, ప్రత్యేకమైన, సంబంధిత వ్యాపారి భాగస్వామ్యాలను పెంచడానికి ఉద్దేశించబడిందన్నారు. మాస్టర్ కార్డ్ సౌత్ ఏషియా డివిజన్ ప్రెసిడెంట్ గౌతమ్ అగర్వాల్ మాట్లాడుతూ… నేటి యువత తమ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఉత్పత్తులను కోరుకుంటున్నారన్నారు. అందుకే, బ్రాండ్‌లు జెన్ జెడ్ అండ్ మిలీనియల్స్‌తో ప్రతిధ్వనించే ఉత్పత్తులు, పరిష్కారాలను రూపొందించడానికి నిరంతరం ఆవిష్కరణలు, సహకరించడం అవసరమన్నారు.