న్యూఢిల్లి : మార్కెట్‌లో ప్రతీ పెట్టుబడిదారుడు మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను ఆధారంగా చేసుకుని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఈ విషయంలో లార్జ్, మిడ్ క్యాప్ కేటగిరిలో లభించే కాంబినేషన్‌లో లోటు ఏర్పడింది. ఈ సందర్భంగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్‌కు సంబంధించిన ఫండ్ మేనేజర్ పరాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. పోర్ట్‌ఫోలియోలో కనీసం 35 శాతం లార్జ్ క్యాప్ కంపెనీలు, మిడ్ క్యాప్ కంపెనీలలో పెట్టుబడి పెట్టబడుతుంది. ఈ స్కీం కోసం ఇన్వెస్ట్‌మెంట్ మార్కెట్‌లో క్యాపిటలైజేషన్ పరంగా టాప్ 250 లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. స్కీమ్ మిడ్ క్యాప్‌ల ద్వారా అధిక మూలధన అవకాశం కల్పించగా.. లార్జ్‌క్యాప్ పోజర్ తక్కువ అస్థిరతను ప్రదర్శిస్తూ.. రాబడిని అందించడమే లక్ష్యంగా ఉంటుంది. సెబీ స్కీమ్ రీ-కేటగరైజేషన్ తరువాత.. ఈ స్కీం అందుబాటులోకి వచ్చింది. ఈ కేటగిరిలో అనేక అస్ధిరత స్కీంలు ఉన్నప్పటికీ.. స్థిరమైనది ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ ఉంది. వివిధ కాల వ్యవధిలో ఉన్న ఫండ్ బెంచ్ మార్క్.. దానికి సంబంధించిన పరిస్థితులను అధిగమించగలిగింది. ఉదాహరణకు తీసుకుంటే.. గతేడాది ఫండ్ దాని బెంచ్ మార్క్ నిఫ్టీ లార్జ్, మిడ్ క్యాప్ 250 టీఆర్‌ఐ ద్వారా అందించబడిన 7.84 శాతం రాబడితో పోలిస్తే.. 14.93 శాతం ఇన్‌కమ్ అందించింది. ఇదే కేటగిరిలో.. రెండు, మూడు ఏళ్ల ఫండ్ వరుసగా 41.72 శాతం, 15.21 శాతం రాబడులను ఇచ్చింది. ఒక ఇన్వెస్టర్ గత పదేళ్లుగా సిప్ ఆధారంగా నెలకు రూ.10,000 చెల్లిస్తూ వస్తే.. మొత్తం పెట్టుబడి రూ.12లక్షలు అవుతుంది. కానీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన మొత్తం విలువ రూ.26,13,450 అవుతుంది.
స్మార్ట్ పోర్ట్‌ఫోలియో..
అటువంటి స్థిరమైన పనితీరు కారణంగా స్మార్ట్ పోర్ట్ ఫోలియో ఎంపికలకు ఎక్కువగా కారణమని చెప్పొచ్చు. ఏప్రిల్ 20, 2022 నాటికి పోర్ట్ ఫోలియో 57 శాతం లార్జ్ క్యాప్ షేర్లను కలిగి ఉంది. తరువాత మిడ్ క్యాప్‌లలో 33 శాతం, స్మాల్ క్యాప్‌లో 4 శాతం ఉంది. సాధారణంగా పోర్ ్టఫోలియోలో 40-55 శాతం లార్జ్‌క్యాప్‌లకు 35-45 శాతం మిడ్ క్యాప్‌లకు, మిగిలినది 10-15 శాతం స్మాల్ క్యాప్‌లకు కేటాయించబడుతుంది. వ్యాల్యూయేషన్ ఆకర్షణీయంగా మారినప్పుడు స్మాల్ క్యాప్‌లో పెట్టుబడి చాలా వరకు వ్యూహాత్మకంగా ఉంటుంది. అలాగే మిడ్ క్యాప్ పేరులో తాత్కాలిక గరిష్ట పెట్టుబడి 3.5 శాతానికి పరిమితం చేయబడింది. వారి రిస్క్ మిటిగేషన్ పాలసీలో భాగంగా స్మాల్ క్యాప్ విషయంలో వ్యక్తిగత కేటాయింపు పరిమితి 1.5 శాతం తగ్గుతుంది. టాప్-డౌన్, బాటమ్-అప్ కలయిక ద్వారా.. ఎంపిక చేయబడిన ఆర్థిక పునరుద్ధరణ నుంచి ప్రయోజనం పొందగల స్టాక్‌లు, రంగాల్లో పోర్ట్ ఫోలియో ఎక్కువగా పెట్టుబడి పెట్టబడుతుంది. దీంతో పోర్ట్ ఫోలియో ఎక్కువగా దేశీయ, గ్లోబల్ స్ట్రక్చరల్, సైక్లికల్ రికవరీని కలిగి ఉంటుంది. బ్యాంక్, టెలికాం, సాఫ్ ్టవేర్‌తో పాటు ఫైనాన్స్‌కు సంబంధించిన స్టాక్స్ పోర్ట్ ఫోలియోలో 50శాతం వరకు ఉంటాయి. భారతీ ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, ఫెడరల్ బ్యాంక్, ఐటీ హెవీ వెయిట్స్ వంటివి మెరుగైన రాబడులు అందించేందుకు దోహదం చేస్తుంటాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..