Friday, November 22, 2024

ఐసీఐసీఐ లాంబార్డ్‌, కార్పొరేట్‌ ఇండియా రిస్క్‌ ఇండెక్స్‌.. నష్టాలు గుర్తించడంలో సహకారం

దేశ ఆర్థిక కార్యలాపాలు వేగంగా పుంజుకుంటున్నాయని, 2020లో 57 స్కోర్‌ ఉన్న కార్పొరేట్‌ ఇండియా రిస్క్‌ ఇండెక్స్‌.. 2021లో 62కు పెరిగిందని ఐసీఐసీఐ లాంబార్డ్‌ ఎండీ, సీఈఓ భార్గవ్‌ దాస్‌గుప్తా అభిప్రాయపడ్డారు. ఈ స్కోర్‌ మరింత పెరుగుదలకు అవకాశం ఉన్న ఆప్టిమైజ్‌డ్‌ రిస్క్‌ హ్యాండ్లింగ్‌ను సూచిస్తుందని వివరించారు. ఈ ఫలితాలు.. ఐసీఐసీఐ లాంబార్డ్‌కు సంబంధించిన కార్పొరేట్‌ ఇండియా రిస్క్‌ ఇండెక్స్‌ (సీఐఆర్‌ఐ) రెండో ఎడిషన్‌లో భాగంగా ఉన్నాయని తెలిపారు. ప్రముఖ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ సంస్థ అయిన ఫ్రాస్ట్‌, సుల్లివన్‌ నిరంతర సహకారంతో కంపెనీ ఈ నివేదికను విడుదల చేసిందన్నారు. భార్గవ్‌ దాస్‌గుప్తాతో పాటు ముఖ్య అతిథిగా హాజరైన సింగపూర్‌ మేనేజ్‌మెంట్‌ యూనివర్సిటీలో.. లీ కాంగ్‌ చెయిన్‌ మార్కెటింగ్‌ ప్రొఫెసర్‌ నిర్మల్య కుమార్‌, ఐసీఐసీఐ లాంబార్‌ ్డ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అలోక్‌ అగర్వాల్‌, ఫ్రాస్ట్‌ అండ్‌ సుల్లివన్‌ ప్రెసిడెంట్‌, మేనేజింగ్‌ పార్టనర్‌ అరూప్‌ జుట్షీ సమక్షంలో కార్పొరేట్‌ ఇండియా రిస్క్‌ ఇండెక్స్‌ 2021 (సీఐఆర్‌ఐ) రెండో ఎడిషన్‌ను లాంచ్‌ చేయడం జరిగింది. 2020లో కార్పొరేట్‌ ఇండియా రిస్క్‌ ఇండెక్స్‌ 57 స్కోర్‌ ఉంటే.. 2021లో 62కు చేరుకుందని తెలిపారు. కార్పొరేట్‌ ఇండియా రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ 2020లో 64 స్కోర్‌ ఉండగా..65కు చేరుకుందని, కార్పొరేట్‌ ఇండియా రిస్క్‌ ఎక్స్‌పోజర్‌ 2020లో 66 స్కోర్‌ ఉండగా.. 2021లో 62కు తగ్గిందని వివరించారు.


వ్యూహాలు మెరుగుపర్చేందుకు..
కంపెనీలకు రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ విస్తృతమైన.. సమగ్ర శ్రేణి సేవలను అందించడమే ఐసీఐసీఐ లాంబార్డ్‌ కార్పొరేట్‌ ఇండియా రిస్క్‌ ఇండెక్స్‌ లక్ష్యమని దాస్‌గుప్తా తెలిపారు. బోర్డు రూంలో రిస్క్‌ ఎజెండాపై నిరంతర దృష్టితో.. తాము ఇండెక్స్‌లో ఆప్టిమల్‌ నుంచి సుపీరియర్‌ రిస్క్‌ హ్యాండ్లింగ్‌కు మారగల సామార్థ్యాన్ని కలిగి ఉన్నామన్నారు. అనంతరం నిర్మల్య కుమార్‌ మాట్లాడుతూ.. ఐసీఐసీఐ లాంబార్డ్‌ కార్పొరేట్‌ ఇండియా రిస్క్‌ ఇండెక్స్‌ వివిధ రంగాలలో నష్టాలు గుర్తించడంతో పాటు రిస్క్‌ను కొలిచేందుకు కీలక సహకారం అందిస్తుందన్నారు. ఈ రిస్క్‌ మెట్రిక్‌ ఆచరణాత్మక సంస్థలు.. తమ వ్యాపారం బహిర్గతమయ్యే ప్రమాద స్థాయిని అర్థం చేసుకోవడానికి, వారి సంసిద్ధత స్థాయిని అంచనా వేయడానికి ఉపయోగపడుతుందన్నారు. దానికి అనుగుణంగా.. వారి రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వ్యూహాలను మెరుగుపర్చడానికి చర్యలు తీసుకోవడానికి సహాయపడుతుందని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement