శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఐసిఐసిఐ బ్యాంక్ తమ నూతన శాఖను ఏర్పాటు చేసింది. నగరంలో బ్యాంక్‌కి ఇది మొదటి శాఖ కాగా జిల్లాలో ఆరవ శాఖ. ఈ శాఖలో ATM-కమ్-క్యాష్ రీసైక్లర్ మెషిన్ (CRM) ఉంది, ఇది వినియోగదారులకు 24 గంటలూ నగదు డిపాజిట్, ఉపసంహరణ సేవలను అందిస్తుంది. జిల్లా సబ్ కలెక్టర్, సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ నూరుల్ క్వమేర్ ఐ.ఎ.ఎస్ ఈ శాఖను ప్రారంభించారు. సేవింగ్స్, కరెంట్ ఖాతాలు సహా విస్తృత శ్రేణి ఖాతాలు, ట్రేడ్, ఫారెక్స్ సేవలు, ఫిక్స్డ్, రికరింగ్ డిపాజిట్లు, రుణాలు- వ్యాపార రుణం, గృహ రుణం, వ్యక్తిగత రుణం, ఆటో లోన్, గోల్డ్ లోన్ తో పాటుగా చెల్లింపులు, కార్డ్ సేవలతో సహా సమగ్రమైన సేవలను ఈ శాఖ అందిస్తుంది.
ఎన్ఆర్ఐ కస్టమర్లకు సైతం బ్యాంకింగ్ సేవలను కూడా ఈ శాఖ అందిస్తుంది. ఇది తమ ప్రాంగణంలో లాకర్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. ఇది ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు సోమవారం నుండి శుక్రవారం వరకు, నెలలో మొదటి, మూడవ, ఐదవ శనివారాలలో పనిచేస్తుంది.ఈ శాఖ ట్యాబ్ బ్యాంకింగ్ సదుపాయాన్ని కూడా అందిస్తుంది, ఇది టాబ్లెట్ పరికరం తో కస్టమర్ ప్రాంగణం వద్ద దాదాపు 100 సేవలను ఒక ఉద్యోగి ద్వారా అందిస్తుంది. ఖాతాలు తెరవడం మరియు ఫిక్సెడ్ డిపాజిట్ (FD), చెక్ బుక్ అభ్యర్థనను చేయడం , ఇ-స్టేట్మెంట్ల ఉత్పత్తి, చిరునామా మార్పు వంటి సేవలు వీటిలో ఉన్నాయి.