ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుండాయ్ వెన్యూ ఎన్ లైన్ పేరుతో కొత్త కారును మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త కాంపాక్ట్ ఎస్యూవీలో రెండు వేరియంట్లు లభ్యమవుతాయి. ఎన్6 వేరియంట్ 12.16 లక్షలకు, ఎన్8 వేరియంట్ 13.15 లక్షలకు లభిస్తుంది. ఇప్పటికే కంపెనీ ఎన్లైన్ సిరీస్లో ఐ20 ఎన్లైన్ ను గత సంవత్సరం లాంచ్ చేసింది. వెన్యూఎన్లైన్ బుకింగ్స్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభింది.
1.3 లక్షల బుకింగ్స్ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. భారత్ మార్కెట్లో 5.5 లక్షల కార్లు అమ్మాలని టార్గెట్గా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది. వెన్యూ ఎన్లైన్ కార్లను నెలకు 10వేల యూనిట్లు అమ్మాలని కంపెనీ భావిస్తోంది.