Friday, November 22, 2024

హ్యుండాయ్‌ చేతికి జనరల్‌ మాెెటార్స్‌ ప్లాంట్‌

మహారాష్ట్రలోని జనరల్‌ మోటార్స్‌ ఇండియాకు చెందిన తాలెగావ్‌ ప్లాంట్‌ను కొనుగోలుకు ఒప్పందంపై సంతకాలు చేసినట్లు హ్యుండాయ్‌ మోటార్స్‌ ఇండియా ప్రతినిధి తెలిపారు. ఈ సంవత్సరం ప్రారంభంలో హ్యుండాయ్‌ ఇండియా తమిళనాడులో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కోసం 20 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అవగాహన ఒప్పందం చేసుకుంది. శ్రీపెరంబుదూర్‌ సమీపంలోని తాతెగావ్‌ ప్లాంట్‌లో సంవత్సరానికి 10 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్ధ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హ్యుండాయ్‌ తెలిపింది.

జనరల్‌ మోటార్స్‌ ఇండియా తాలెగావ్‌ ప్లాంట్‌ ప్రస్తుతం 1.30 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యాన్ని కలిగి ఉంది. హ్యుండాయ్‌ మోటార్స్‌ ఇండియా ఇప్పటికే ఇప్పటికే ఈ సంవత్సరం మొదటి ఆర్ధ భాగంల ఉత్పత్తి సామర్ధ్యాన్ని 7.50 లక్షల యూనిట్ల నుంచి 8.20 లక్షల యూనిట్లకు పెంచింది. జనరల్‌ మోటార్స్‌ కంపెనీతో ఒప్పందం మూలంగా 10లక్షల యూనిట్ల ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుందని తెలిపింది.

జనరల్‌ మోటార్స్‌ మన దేశంలో 20 సంవత్సరాలు కార్యకలాపాలు నిర్వహించి, 2017లో దేశంలో కార్ల అమ్మకాలను నిలిపివేసింది. ఈ ప్లాంట్‌ను చైనాకు చెందిన గ్రేట్‌ వాల్‌ మోటార్స్‌కు విక్రయించేందుకు జనరల్‌ మోటార్స్‌ ప్రయత్నించింది. చైనా కంపెనీ భారత మార్కెట్‌లోకి ప్రవేశించే ప్రణాళికలను ఉపసంహరించుకోవడంతో ఈ ఒప్పందం నిలిచిపోయింది. తాజాగా ఈ ప్లాంట్‌ను హ్యుండాయ్‌ కొనుగోలు చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement