Wednesday, November 20, 2024

HYD| 30వ ఇండియన్ ప్లంబింగ్ కాన్ఫరెన్స్‌కు సిద్ధమైన హైదరాబాద్

హైద‌రాబాద్ : భారతదేశపు ప్లంబింగ్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతూ, తొమ్మిదేళ్ల విరామం తర్వాత హైదరాబాద్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 30వ ఇండియన్ ప్లంబింగ్ కాన్ఫరెన్స్ (ఐపీసీ) జరుగనుంది. నవంబర్ 21-23, 2024 తేదీలలో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరుగనున్న ఈ మెగా సమ్మేళనంలో అంతర్జాతీయంగా 1,500 మంది డెలిగేట్‌ లు, 80+ ఎగ్జిబిటర్‌లు హాజరుకానున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద ప్లంబింగ్ పరిశ్రమ కలయికగా మారనుంది.

ఈసంద‌ర్భంగా ఇండియన్ ప్లంబింగ్ అసోసియేషన్ (ఐపిఏ) జాతీయ అధ్యక్షుడు గుర్మిత్ సింగ్ అరోరా మాట్లాడుతూ…. నీరు కేవలం ఒక వనరు కాదు, ఇది మన సమాజాలు, ఆర్థిక వ్యవస్థలకు జీవనాధారమ‌న్నారు. 2030 నాటికి, భారతదేశ నీటి డిమాండ్, సరఫరాను మించిపోతుందని అంచనా వేయబడిందన్నారు. మన నగరాలు డే జీరో ను చేరుకోకుండా నిరోధించడానికి మనం ఇప్పుడు చర్య తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీ అండ్ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు హాజరుకానున్నారు. దాన కిషోర్, IAS, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పట్టణాభివృద్ధి శాఖ, గౌరవ అతిథిగా పాల్గొననున్నారు. అంతర్జాతీయ దృక్పథాన్ని జోడిస్తూ, భారతదేశంలోని డెన్మార్క్ రాయబార కార్యాలయం నుండి కమర్షియల్ కౌన్సెలర్ అయిన సోరెన్ నార్రెలుండ్ కన్నిక్-మార్క్వార్డ్‌సెన్ కీలక ప్రసంగం చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement