దేశంలో వెడ్డింగ్ చుట్టూ అతి పెద్ద బిజినెస్ కొనసాగుతోంది. ఈ రంగంలో బిజినెస్‌కు అనేక అవకాశాలు ఉన్నాయి. మన దేశంలో వెడ్డింగ్ బిజినెస్ రంగం 51 బిలియన్ డాలర్లకు చేరింది. దేశంలోనే అతి పెద్ద బిజినెస్‌లో ఇదొకటిగా అవతరించింది. ప్రస్తుతం పెళ్లి అంటే ఎన్నో అంశాలతో ముడిపడి ఉంది. భారీగా కొనుగోళ్లు ఉంటాయి. మ్యారేజీ బ్యూరో మొదలు, పెళ్లి జరిగే మండపాలు, ఫంక్షన్ హాల్స్, స్టార్ హోటల్స్, కన్వెన్షన్ సెంటర్లు, హంగు ఆర్బాటాలు, విందులు, వినోదాలు ఎలా దీని చుట్టూ చాలా రంగాలే ఉన్నాయి.
ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో వివాహలు జరగనున్నాయి. వెడ్డింగ్ అంటే ముందుకు ఎక్కువ ఖర్చు చేసిది షాపింగ్‌లోనే. ఇందులోనూ జ్యువెలరీదే అగ్రస్థానం. ఇటీవల కాలంలో పెళ్లిలో అత్యంత ముఖ్యమైనది జ్యువెలరీనే. ఇందులో అనేక రకాలు ఉన్నాయి. వెడ్డింగ్ జ్యువెలరీ కన్సెప్ట్‌కు చాలా డిమాండ్ ఉంది.
ప్రాంతాలు, ఆచార వ్యవహారాలు, మతాలు, విశ్వాసాల ఆధారంగా, పురాతన కాలం నాటి డిజైన్లు, స్పెషలైయిడ్, కస్టమైయిజ్ డిజైన్లు ఇలా అభిరుచిని బట్టి జ్యువెలరీని కొనుగోలు చేస్తుంటారు. ప్రధానంగా బంగారం, డైమండ్, వెండి, ప్లాటినం జ్యువెలరీకి డిమాండ్ ఎక్కువ. వీటిలో బంగారం అమ్మకాలే అత్యధికంగా ఉంటున్నాయి.
8-11 శాతం అధిక అమ్మకాలు…
ఈ సారి వెడ్డింగ్ సీజన్‌లో దీనితో ముడిపడి ఉన్న అన్ని రకాల బిజినెస్‌లు 8-11 శాతం వరకు వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ కుమార్ రాజగోపాలన్ చెప్పారు. జ్యువెలరీ, గార్మెంట్స్, ఫుట్‌వేర్, డిజైనర్ క్లాతింగ్, యాక్సెసరీస్ ఇలా అనేక విభాగాల్లో ఈ వృద్ధి ఉంటందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. నవంబర్ చివరి వారం నుంచి వచ్చే సంవత్సరం జనవరి వరకు వివాహాలకు మూహుర్తాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
సాధారణంగా హిందువులు దీపావళి వెళ్ళిపోయిన తరువాత వరసగా కొన్ని నెలల పాటు పెళ్లిళ్ల సీజన్‌గానే భావిస్తారు. ఆర్ధిక వ్యవస్థ మందగమనం ఉన్నప్పటికీ, మన దేశంలో బలమైన పరిస్థితి ఉన్నందునీ సీజన్ మొదటి వారాల్లో మంచి బిజినెస్ జరుగుతుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు కనీసం 4.25 లక్షల కోట్లు (51 బిలియన్ డాలర్లు) బిజినెస్ జరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది.
ఇందులో ఎక్కువ ఖర్చు నగల కొనుగోలు, ఇంటి అలంకరణ, పెళ్లికి వచ్చిన గెస్టులకు విందులు, పార్టీలు ఏర్పాట్లకు అవుతుంది.
గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం అక్టోబర్- డిసెంబర్ కాలంలో నగల అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నట్లు మెటల్స్ ఫోకస్ ఇండియా ప్రిన్సిపల్ కన్సల్టెంట్ చీరాగ్ సేథ్ అభిప్రాయపడ్డారు. బంగారం ధర పెరిగితే మాత్రం కొనుగోళ్లలో 2-3 శాతం తక్కువగా ఉంటే అవకాశం ఉందన్నారు.
ధనవంతుల ఇళ్లలో జరిగే పెళ్లి మరింత గ్రాండ్‌గా, రిచ్‌గా చేస్తున్నారు. పెళ్లి కోసమే వందల కోట్లు ఖర్చు చేసే కుటుంబాలు ఇండియాలోఉన్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో విదేశాల్లో అత్యంత ఖరైదన ప్రాంతాల్లో, భారీ ఖర్చుతో పెళ్లిళ్లు చేస్తున్నారు.
పెళ్లి ఖర్చ 10-20 శాతం పెరిగిందని లే మాగ్నిఫిక్ సంస్థ వెడ్డింగ్ ప్లానర్ నీరజ్ కుమార్ చెప్పారు. పెళ్ళి కూతురు డ్రెస్‌కు భారీగా ఖర్చు చేస్తున్నారు.
ప్రత్యేకంగా వీటిని సందర్భానికి తగిన విధంగా వివిధ రకాల డిజైన్లతో తయారు చేయించుకుంటున్నారు. వీటికి తగిన విధంగా జ్యువెలరీని ఎంపిక చేస్తున్నారు. దీనితో పాటే ఇతర యాక్సెసరీలు ఉంటాయి. నేడు మధ్యతరగతి కుటుంబాల్లోనూ పెళ్లి ఖర్చు భారీగానే ఉంటుంది. పెళ్లి అనగానే నగలు, బట్టలతో పాటు, వెడ్డింగ్ జరిగే హాల్, భోజనాలు, గెస్టులకు గిఫ్ట్ లు, ఇలా అనేక రంగాల్లోబిజినెస్ భారీగా జరుగుతుంది.