Monday, November 25, 2024

క్యూ2లో ఎల్‌ఐసీకి భారీ లాభాలు.. 15,952 కోట్ల నికర లాభాలు నమోదు

ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) రెండోత్రైమాసికంలో భారీ లాభాలు నమోదు చేసింది. సెప్టెంబర్‌తో ముగిసిన ఈ త్రైమాసికంలో ఎల్‌ఐసీ 15,952 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత సంవత్సరం ఇదే కాలంలో సంస్థ నికర లాభం 1434 కోట్లుగా ఉంది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో ఎల్‌ఐసీ నికర లాభం 692.9 కోట్లుగా ఉంది. ఎల్‌ఐసీ పెట్టిన పెట్టుబడులు సంస్థకు ఈ స్థాయిలో లాభాలు తెచ్చాయి. ఈ త్రైమాసికంలో ఎల్‌ఐసీ ప్రీమియం ద్వారా వచ్చే ఆదాయం 1.04 లక్షల కోట్ల నుంచి 1.32 లక్షల కోట్లకు పెరిగాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే ఇది 26.6 శాతం ఎక్కువ. తొలి ప్రీమియం ద్వారా వచ్చే ఆదాయం 8198.30 కోట్ల నుంచి 9124.7 కోట్లకు పెరిగింది. రెన్యూవల్‌ ప్రీమియం కూడా 2 శాతం వృద్ధితో 56,156 కోట్లకు పెరిగింది. ఎల్‌ఐసీ మొత్తం ఆదాయం 18,72,043.6 కోట్ల నుంచి 22,29,488.5 కోట్లకు పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement