Tuesday, November 26, 2024

మద్యం దుకాణాల భారీ ఆఫర్‌.. ఒక బాటిల్‌ కొంటే మరో బాటిల్‌ ఉచితం..

మద్యం బాటిల్‌ ఒక బాటిల్‌ కొంటే ఒకటి ఉచితం అంటే మందుబాబులు ఊరికే ఉంటారా? బారులు తీరి మరి కొన్నారు. ఎక్కడ చూసినా మద్యం షాపుల వద్ద మందుబాబులు బారులు తీరారు. ఇదేమి ఆషాడం ఆఫర్‌ కాదు… అదయితే ఏ చీరలో.. బంగారంపైనో వ్యాపారులు ఆఫర్‌ ప్రకటిస్తారు. ఇది మద్యం ఇది ఎక్కడ అనుకుంటున్నారా? ఎక్కడో కాదు మన దేశరాజధాని ఢిల్లిలో. 2021-22కి ఢిల్లి నగర పాలక సంస్థ ఆగస్టు 1 నుంచి కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది. దీంతో విక్రయదారులు జూలై 31న తమ విక్రయాలను ఎలాగైనా త్వరగా అమ్మాలనే ఉద్దేశ్యంతో ఒకటి కొంటే ఒకటి ఉచితం అనే ఆఫర్‌ను ప్రకటిచండంతో మందుబాబులు బారులు తీరారు. నగరంలోని మద్యం దుకాణాల్లోనే కాకుండా.. బార్‌లు, పబ్‌లలో కూడా మద్యం హాట్‌కేకుల్లా అమ్ముడు పోయింది. ఎందుకంటే ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రకటించింది.

ఈ పాలసీ ప్రకారం మద్యం బాటిల్‌పై భారీగా తగ్గింపు విధించింది. దీంతో విక్రయదారులు ఎలాగైనా పాతస్టాక్‌ను పాత ధరలకే విక్రయించుకునేలా మందు బాబులకు ఆఫర్‌ను ప్రకటించింది. కొత్త మద్యం పాలసీ వల్ల తమకు తీరని నష్టం కలుగుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది.. మరుసటి రోజు ఆగస్టు 1న మాత్రం మందుబాబులకు తీరని కష్టాలు ఎదురయ్యాయి. షాపుల్లో విక్రయాలు పూర్తిగా జరగడంతో మద్యం అందుబాటులో లేకుండా పోయింది. దీంతో వినియోగదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ వల్లే ఇలాంటి కష్టాలు సామన్యుడికి ఎదురయ్యాయని పలువురు విమర్శలు గుప్పించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement