భారత్‌లో డేటా సెంటర్ల రంగానికి ఉజ్వల భవిష్యత్ ఉందని రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సేవల సంస్థ సీబీఆర్ఈ వెల్లడించింది. దేశంలోని డేటా కేంద్రాలు పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు ఈ నివేదిక తెలిపింది. సీబీఆర్ఈ తాజాగా విడుదల చేసిన ‘ఫ్రమ్ బైట్స్ టు బిజినెస్’ అనే నివేదిక ప్రకారం, ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలోనే దాదాపు రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడులు లభించినట్లు వెల్లడించింది.
అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ, మనదేశంలో డేటాసెంటర్ల రంగానికి సానుకూల పవనాలు ఉన్నాయి. విస్తరిస్తున్న టెక్నాలజీ, డిజిటలైజేషన్ వేగవంతం, 5జీ, కృత్రిమమేథ, బ్లాక్‌చైన్, క్లౌడ్ తదితర ఆధునాతన టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతుండటంతో భారత్‌లో డేటా కేంద్రాల అవసరాలు పెరిగాయని సీబీఆర్ఈ నివేదిక అభిప్రాయపడింది.
మూడేళ్లలో సామర్థ్యం రెట్టింపు..
మన దేశంలో డేటా కేంద్రాల సామర్థ్యం గత మూడేళ్ల కాలంలో రెట్టింపు అయింది. ఈ ఏడాది జూన్ నాటికి 880 మెగావాట్ల సామర్థ్యానికి చేరింది. డిసెంబర్ ఆఖరు నాటికి ఇది 1,048 మెగావాట్లకు చేరుకుంటుందని అంచనా. 2018 నుంచి 2023 ప్రథమార్ధం వరకూ డేటా కేంద్రాల మార్కెట్ 35 బిలియన్ డాలర్ల(సుమారు రూ.2.87 లక్షల కోట్లు) పెట్టుబడిని ఆకర్షించినట్లు పేర్కొంది.
ముఖ్యంగా #హపర్ స్కేల్ డేటా కేంద్రాలకు అధిక పెట్టుబడులు లభించాయి. దాదాపు 89 శాతం పెట్టుబడి #హపర్ స్కేల్ డేటా కేంద్రాలకు లభించగా, 11 శాతం పెట్టుబడిని కోల్ఖొకేషన్ డేటా కేంద్రాలు ఆకర్షించాయి. డేటా కేంద్రాలు మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో అధికంగా ఏర్పాటయ్యాయని సీబీఆర్ఈ ఛైర్మన్, సీఈఓ అన్షుమన్ మ్యాగజైన్ వివరించారు. దీనివల్ల వచ్చే కొన్నేళ్లలో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మనదేశం డేటా కేంద్రాలకు కేంద్ర స్థానంగా మారుతుందని తెలిపారు.