Friday, November 22, 2024

భారీగా పెరిగిన యూపీఐ చెల్లింపులు.. సెప్టెంబర్‌లో 10.72 లక్షల కోట్లు దాటాయి

యూపీఐ చెల్లింపులు రికార్డ్‌ స్థాయికి చేరుకున్నాయి. సెప్టెంబర్‌ నెలలో ఈ చెల్లింపులు 10.72 లక్షల కోట్లకు పైగా జరిగాయి. మొత్తం 678 కోట్ల లావాదేవీలు జరిగాయని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) తెలిపింది. 2016లో యూపీఐ చెల్లింపుల విధానాన్ని ప్రారంభించారు. మొదటిసారిగా మే నెలలో యూపీఐ చెల్లింపులు 10 లక్షల కోట్లకు చేరాయి. యూపీఐలో వ్యక్తుల నుంచి వ్యక్తులకు ఎక్కువగా చెల్లింపులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించడంలేదు.

దేశంలో నగదు రహిత లావాదేవీలు గణనీయంగా పెరగడానికి యూపీఐ దోహదపడుతోంది. ఎన్‌పీసీఐ డేటా ప్రకారం జూన్‌లో 10,14,384 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. పండుగల సీజన్‌ అయిన అక్టోబర్‌, నవంబర్‌లో యూపీఐ చెల్లింపులు మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. యూపీఐ చెల్లింపులు నేరుగా జరుగుతాయని థర్ట్‌ పార్టీ ప్రమేయం ఉండకపోవడం వల్లే లావాదేవీలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. చెల్లింపులకు ఎలాంటి ఓటీపీ అవసరంలేదు. చాలా మోసాలు ఓటీపీ వల్లే జరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement