గుత్తాదిపత్యాన్ని దుర్వినియోగం చేస్తుందని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గూగుల్ పై భారీ జరిమానా విధించింది. దీనిపై స్పందించిన గూగుల్ సీసీఐ తీసుకున్న నిర్ణయం భారతీయ వినియోగదారులకు, వ్యాపారులకే పెద్ద ఎదురు దెబ్బగా పేేర్కొంది. ఇది వారికే నష్టమని తెలిపింది. సీసీఐ ఇచ్చిన తీర్పుపై సమీక్షించి తదుపరి చర్యలు తీసుకుంటాని గూగుల్ తెలిపింది. అండ్రాయిడ్ మొబైల్ విభాగంలో గూగుల్ తన గుత్తాదిపత్యాన్ని దుర్వినియోగం చేస్తుందని పేర్కొంటూ సీసీఐ గూగుల్‌కు 1337.76 కోట్ల రూపాయల జరిమానా విధించింది.
అనైతిక వ్యాపార కార్యకలాపాలు మానుకోవాలని, నిర్ధేశిత గడువులోగా తన ప్రవర్తన మార్చుకోవాలని సీసీఐ సూచించింది. దీనిపై గూగుల్ శుక్రవారం నాడు అధికారికంగా స్పందించింది. గూగుల్ అండ్రాయిడ్ ప్రతి ఒక్కరికీ అనేక ఎంపికలు సృష్టించిందని, భారత్‌తో పాటు, ప్రపంచ వ్యాప్తంగా వేలాది వ్యాపారాలు విజయవంతానికి మద్దతుగా నిలిచిందని తెలిపింది. సీసీఐ తీసుకున్న నిర్ణయం భారతీయ వినియోగదారులకు, వ్యాపారులకు పెద్ద ఎదురు దెబ్బగా అభిప్రాయపడింది. అండ్రాయిడ్ సెక్యూరిటీ ఫీచర్లను విశ్వసించే భారతీయులకు ఇది తీవ్రమైన భద్రతా పరమైన సమస్యలను తీసుకు వస్తుందని పేర్కొంది. ఈ నిర్ణయం మొబైల్ డివైజ్‌ల ధరలు పెరిగేందుకు దారితీస్తుందని గూగుల్ అభిప్రాయపడింది.