Monday, November 11, 2024

iPhone | చైనాలో ఐఫోన్లపై భారీ డిస్కౌంట్‌..

సాధారణంగా యాపిల్‌ ఐఫోన్ల ధరలు కొత్త ఫోన్లు మార్కెట్‌లోకి వస్తే, పాత మోడల్స్‌ ధరలను తగ్గిస్తుంటుంది. సాధారణంగా డిసెంబర్‌లో క్రిస్మస్‌ సందర్భంగా అమెరికాలో ఐఫోన్ల ధరలను కంపెనీ ఆఫర్‌లో తగ్గిస్తుంది. ప్రస్తుతం అమ్మకాలు పెంచుకునేందుకు చైనాలో మాత్రం కంపెనీ ఐఫోన్ల ధరలను గణనీయంగా తగ్గిస్తోంది. లేటెస్ట్‌ మోడల్స్‌పై కూడా భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది.

యాపిల్‌ ఐఫోన్లకు చైనా అతి పెద్ద మార్కెట్‌గా ఉంది. ప్రపంచ మార్కెట్‌లో ఐఫోన్లను శాంసంగ్‌ ప్రీమియం ఫోన్ల నుంచి గట్టి పోటీ ఉంది. చైనాలో మాత్రం చైనా ఐఫోన్‌గా పేరుబడిన హువావే నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది. చైనాలో హువావే తన ఫోన్ల అమ్మకాలు భారీగా పెంచుకుంటోంది. దీంతో ఐఫోన్‌ మార్కెట్‌కు గండిపడుతోంది. చైనాలో అమ్మకాలు పెంచుకునేందుకు కంపెనీ మే 28 వరకు భారీ తగ్గింపు రేట్లను ప్రకటించింది.

ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ 1టీబీ వెర్షన్‌పై 318 డాలర్లు డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తోంది. మన కరెన్సీలో ఇది 27 వేల రూపాయల డిస్కౌంట్‌ ఇస్తోంది. ఐఫోన్‌ బేస్‌ వేరియంట్‌పై 16వేల డిస్కౌంట్‌ ప్రకటించింది. చైనాలో ఈ ఏడాది ఐఫోన్లపై ఇలా డిస్కౌంట్‌ ప్రకటించడం ఇది రెండోసారి.

హువావే ఇటీవల మార్కెట్‌లో ప్యూరా 70 సిరీస్‌, మేట్‌ 60 ఫోన్లను లాంచ్‌ చేసింది. ఈ రెండు మోడల్స్‌ ఐఫోన్లకు పోటీ ఇస్తున్నాయి. ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో చై నాలో యాపిల్‌ ఐఫోన్ల అమ్మకాలు 19 శాతం తగ్గితెె, హువావే అమ్మకాలు 70 శాతం పెరిగాయి. చైనాలో స్మార్ట్‌ ఫోన్ల మార్కెట్‌లో యాపిల్‌ వాటా 20 నుంచి 15.5 శాతానికి తగ్గిపోయింది. ఇతర చైనా కంపెనీల బ్రాండ్ల నుంచి కూడా ఐఫోన్‌ గట్టి పోటీ ఎదుర్కోంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement