Friday, November 22, 2024

ఫైబర్‌ కనెక్షన్లకు భారీ డిమాండ్‌.. డీటీహెచ్‌ రంగం కుదేలు

వినోద రంగంలో ఫైబర్‌ జోరు పెరిగింది. కేబుల్‌ టీవీల రంగాన్ని డైరెక్ట్‌ టూ హోం (డీటీహెచ్‌) దెబ్బకొట్టింది. తాజా టెక్నాలజీ పెరగడంతో హై స్పీడ్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ అందుబాటులోకి వచ్చింది. దీని వల్ల వినోద రంగంలో ఫైబర్‌కు ఆదరణ పెరుగుతోంది. ఫలితంగా డైరెక్ట్‌ టూ హోం సర్వీస్‌ల నుంచి పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఫైబర్‌ కనెక్షన్లకు మారిపోతున్నారు. రెగ్యులేటర అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) వెల్లడించిన వివరాల ప్రకారం డీటీహెచ్‌ వినియోగదారుల్లో గణనీయమైన తగ్గుదల నమోదైంది.

గత మూడు నెలల కాలంలోనే 13.20 లక్షల మంది కస్టమర్లు డీటీహెచ్‌ నుంచి వైదొలిగారు. వాతావరణ పరిస్థితులు, సాంకేతిక లోపాల మూలంగా తరచుగా డీటీహెచ్‌ సేవలకు అంతరాయం కలుగుతోంది. ఫైబర్‌ కనెక్షన్లు అంతరాయం లేని సేవలు అందిస్తున్నాయి. దీంతో కస్టమర్లు వైఫై కనెక్షన్లతో పాటు, ఫైబర్‌ సేవలను టీవీ రంగంలోనూ ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. ఇలా వినియోగదారులు ఫైబర్‌ సేవలకు మళ్లేందుకు భారీగా పెరుగుతున్న ఓటీటీ యాప్‌లు కూడా ఒక కారణం.

- Advertisement -

ఫైబర్‌ కనెక్షన్‌ ద్వారా సేవలు అం దిస్తున్న ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) యాప్‌లు తాజా సీనిమాలు, వెబ్‌ సిరీస్‌లు, టీవీ షోలను అందిస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం 2.23 కోట్ల మంది వినియోగదారుల ఇప్పటికే ఫైబర్‌ కనెక్షన్లకు మారారు. ఇటీవల జియో ఫౖౖెబర్‌ సేవలు, జియో సినిమా వంటివి ప్రచారంలోకి వచ్చిన తరువాత ఫైబర్‌ వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగిందని రిలయన్స్‌ తెలిపింది. ఫైబర్‌ కనెక్షన్లు ముందు ముందు మరింత భారీగా పెరుగుతాయని రిలయన్స్‌ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement