ఛత్తీష్ఘడ్లోని నాగర్నర్లో ఎన్ఎండీసీ నిర్మిస్తున్న స్టీల్ ప్లాంట్ను ప్రయివేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం వచ్చే సంవత్సరం మార్చిలో బిడ్లు పిలవనుంది. కొత్తగా నిర్మించిన ఈ స్టీల్ ప్లాంట్ ఈ నెలోనే ఉత్పత్తి ప్రారంభించనుంది. ఇన్వెస్ట్మెం ట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్(డీఐపీఏఎం) ప్రయివేకరణ ప్రక్రియను చేపట్టనుంది. ఎన్ఎండీసీ నుంచి నాగర్నర్ స్టీల్ ప్లాంట్ను విడదీసే కార్యక్రమం తుది దశకు చేరుకుందని , ఇది పూర్తయిన వెంటనే ప్రయివేటీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుందని అధికారులు తెలిపారు.
సంవత్సరానికి 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో ఎన్ఎండీసీ ఈ స్టీల్ ప్లాంట్ను నిర్మించింది. బస్తర్ సమీపంలో దీన్ని 23,140 కోట్ల వ్యయంతో 1980 ఎకరాల్లో నిర్మించారు. ఎన్ఎండీసీ నుంచి దీన్ని విడదీసిన తరువాత నాగర్నర్ స్టీ ల్ ప్లాంట్(ఎన్ఎస్పీ)లో ప్రభుత్వానికి 60.79 శాతం వాటా ఉంటుంది. మిగిలిన వాటాలను ఇన్వెస్టర్లకు విక్రయించనున్నారు. ప్రభుత్వం తన వాటాను పూర్తిగా ఆసక్తి చూపిన కంపెనీలు, సంస్థలకు అమ్మనుంది.