Saturday, November 23, 2024

రెండేళ్లుగా పెరుగుతున్ను ఇళ్ల ధరలు…

దేశంలో గత రెండు సంవత్సరాలుగా ఇళ్ల ధరలు పెరుగున్నాయి. వీటితో పాటు రుణ రేట్లు కూడా పెరగడంతో వీటిని కొనడం కష్టంగా మారిపోయింది. ఇళ్ల ధరలు అందుబాటులో లేవని జేఎల్‌ఎల్‌ ఇండియా నివేదిక వెల్లడించింది. దేశ వ్యాప్తంగా 7 ప్రధాన నగరాల్లో ఇదే పరిస్థితి ఉందని ఈ నివేదిక తెలిపింది. 2024లో రెపో రేటు తగ్గే అవకాశం ఉన్నందున, ఇళ్ల కొనుగోలుదార్లకు మళ్లిd మంచి రోజులు వచ్చే అవకాశం ఉందిని ఈ నివేదిక పేర్కొంది.

కస్టమర్ల కొనుగోలు స్థోమత స్థాయి మెరుగుపడి ఇళ్ల అమ్మకాలు పెరుగుతాయని తెలిపింది. స్థిరాస్తి, ధరలు, గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరిగినా వినియోగదార్ల స్థోమత స్థాయి పెరిగితే గృహాల విక్రయాలు ఉపందుకుంటాయని పేర్కొంది. హోమ్‌ పర్చేజ్‌ అఫర్డబులిటీ ఇండెక్స్‌ (హెచ్పీఏఐ)ను జేఎల్‌ఎల్‌ విడుదల చేసింది. ఇది నగర స్థాయిలో కుటుంబాల సగటు వార్షిక ఆదాయ ఆర్జన, ప్రస్తుతం ఆ నగరంలో ఉన్న మార్కెట్‌ ధర ప్రకారం ఆస్తిపై గృహ రుణం పొందేందుకు అర్హతను నిర్ణయిస్తుంది.

అంతర్జాతీయ మందగమనం, అధిక ద్రవ్యోల్బణ ధోరణితో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 202లో రెపో రేటును క్రమంగా పెంచుకుంటూ పోయింది. ఇళ్లకు బలమైన గిరాకీ వల్ల కూడా వాటి ధరలు పెరిగాయని, దీంతో కుటుంబాల గృహ కొనుగోలు స్థోమత తగ్గిందని పేర్కొంది. 2022తో పోలిస్తే ఈ ఏడాది కూడా స్థోమత స్థాయిలు స్వల్పంగా తగ్గాయని తెలిపింది. వచ్చే ఏడాది రెపోరేటులో 60-80 బేసిస్‌ పాయింట్ల వరకు కోత విధించే అవకాశం ఉందని జేఎల్‌ఎల్‌ అంచనా వేసింది. ఇదే జరిగితే హోం లోన్స్‌ వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఇళ్లు కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించే అవకాశం ఉందని ఈ నివేదిక తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement