ఐటీసీ సంస్థ తన హోటల్ బిజినెస్‌ను వేరు చేసింది. ఇందు కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. కొత్త సంస్థలో ఐటీసీకి 40 శాతం వాటా ఉంటుది. మిగిలిన వాటాలు పబ్లిక్ హోల్దింగ్‌గా ఉంటుందని కంపెనీ తన ఫైలింగ్‌లో పేర్కొంది. డీమెర్జర్ ప్రతిపాదనను ఆగస్టు 14న జరిగే బోర్డు మీటింగ్‌లో ఆమోదం కోసం ఉంచనున్నట్లు తెలిపింది. హోటల్ బిజినెస్‌ను విడదీసేందుకు బోర్డు సూత్ర ప్రాయంగా ఆమోదం తెలిపిందని, పూర్థి స్థాయి ఆమోదాన్ని ఆగస్టు 14న జరిగే సమావేశంలో తీసుకోనుట్లు తెలిపింది.
హోటల్ బిజినెస్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న సంస్థ చట్టబద్ద సంస్థలన్నింటి నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. ఈ నిర్ణయం వాటాదారులకు మేలు చేస్తుందని తెలిపింది. ఆతిధ్య రంగంపై మరింతగా దృష్టి పెట్టేందుకు ఈ బిజినెస్‌ను ప్రత్యేక సంస్థగా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఐటీసీకి ప్రస్తుతం 70 ప్రాంతాల్లో 120 హోటల్స్ ఉన్నాయి.
వీటిలో 11,600 రూమ్స్ ఉన్నాయి. మొత్తం ఐటీసీ రెవెన్యూలో హోటల్ బిజినెస్ వాటా 5 శాతం కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం ఐటీసీ మార్కెట్ విలువ 6 లక్షల కోట్లుగా ఉంది. దేశంలో ఏడో అతి పెద్ద కంపెనీగా ఉంది. ఐటీసీ ప్రధానంగా దేశంలోనే అతి పెద్ద సిగరేట్ల తయారీ కంపెనీగా ఉంది. ఐటీసీ బ్రాండ్ కింద హోటల్స్, పేపర్ బోర్డు, ఎఫ్‌ఎంసీజీ బిజినెస్, ప్యాకేజింగ్, అగ్రి బిజినెస్ ఉన్నాయి.