Wednesday, November 20, 2024

హోండా ఎలివేట్‌ ధర రూ.10.99 లక్షలు

జపాన్‌కు చెందిన ఆటోమొబైల్‌ కంపెనీ హోండామోటార్స్‌ అనుబంధ హోండా కార్స్‌ ఇండియా.. మిడ్‌ సైజ్‌ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లోకి ప్రవేశించింది. ఎలివేట్‌ పేరిట కొత్త కారును భారత మార్కెట్లోకి సోమవారం (సెప్టెంబర్‌ 4) విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.10.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లిd). ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న హ్యుందాయ్‌ క్రెటా, మారుతీ సుజుకీ గ్రాండ్‌ విటారా, కియా సెల్టోస్‌, టయోటా అర్బన్‌ క్రూయిజర్‌ హర్డర్‌ వంటి కార్లకు ఎలివేట్‌ పోటీ ఇవ్వనుంది.

మైలేజీ 16కిమీ.

హోండా ఎలివేట్‌లో 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంది. సిక్స్‌ స్పీడ్‌ మాన్యువల్‌, సెవెన్‌ స్పీడ్‌ కంటిన్యూస్లీ వేరియబుల్‌ ట్రాన్స్‌మిషన్‌ (సీవీటీ) వేరియంట్లో లభిస్తోంది. మాన్యువల్‌ వేరియంట్స్‌ ధరలు రూ.10.99 లక్షల నుంచి రూ.14.9 లక్షల మధ్య ఉండగా, ఆటోమేటిక్‌ వేరియంట్ల ధరలు రూ.13.2 లక్షల నుంచి రూ.15.99 లక్షల మధ్య ఉన్నాయి. మాన్యువల్‌ వేరియంట్‌ మైలేజీ లీటర్‌కు 15.31 కిలోమీటర్లు కాగా, సీవీటీ వేరియంట్‌ మైలేజీ 16.92 కిలోమీటర్లుగా కంపెనీ పేర్కొంది. ఇందులో 458 లీటర్ల కార్గో స్పేస్‌ లభిస్తుంది. ఏడు సింగిల్‌ టోన్‌ కలర్‌ ఆప్షన్లు, మూడు డ్యయూల్‌ టోన్‌ కలర్‌ ఆప్షన్స్‌తో ఎలివేట్‌ లభిస్తుంది.

- Advertisement -

ఫీచర్లు..

ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 17 అంగుళాల డైమండ్‌ కట్‌ అల్లాయ్‌ వీల్స్‌ ఇస్తున్నారు. మల్టి ఫంక్షనల్‌ స్టీరింగ్‌ వీల్‌, డ్యూయల్ కమెట్‌ కంట్రోల్‌, పనోరమిక్‌ సన్‌రూఫ్‌ వంటివి ఉన్నాయి. 10.25 అంగుళాల టచ్ స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, వైర్‌లెస్‌ కార్‌ కనెక్ట్‌ టెక్నాలజీకి సపోర్ట్‌ చేసే 8 స్పీకర్స్‌, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, స్పీడ్‌ వార్నింగ్‌, పార్కింగ్‌ సెన్సర్‌, లేన్‌ కీప్‌ అసిస్టెన్స్‌, అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెంటెన్స్‌ సిస్టమ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. మూడేళ్ల అన్‌లిమిటెడ్‌ కిలోమీటర్‌ వారెంటీతో పాటు 5 ఏళ్ల ఎక్సెడెంటెండ్‌ వారెంటీ, 10 ఏళ్ల పాటు రోడ్‌ సైడ్‌ అసిస్టెన్స్‌ సదుపాయం వంటివి ఆఫర్‌ చేస్తున్నారు. డెలివరీలు ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement