Tuesday, November 26, 2024

పాఠశాలలో బాలికల హైజీన్ కోసం హింద్‌వేర్ “డేర్ టు డ్రీం”

భారతదేశపు ప్రముఖ బాత్వేర్ బ్రాండ్ అయిన హింద్వేర్ లిమిటెడ్ వారు తమ “బిల్డ్ ఎ టాయిలెట్, బిల్డ్ హర్ ఫ్యూచర్” కార్యక్రమం ద్వారా యువతులను శక్తివంతం చేయడానికి, వారి కమ్యూనిటీలను ఉద్ధరించడానికి వారి మిషన్ కొనసాగిస్తున్నారు.

2020లో #HygieneThatEmpowers సిఎస్ఆర్ ప్రయత్నంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం.. ఈ సంవత్సరం ‘డేర్ టు డ్రీమ్’ థీమ్ తో కొత్త కోణాన్ని తీసుకువచ్చింది. ‘బిల్డ్ ఎ టాయిలెట్, బిల్డ్ హర్ ఫ్యూచర్’ కార్యక్రమంలో భాగంగా పుణెకు చెందిన ఎన్జీవో మానస్ ఫౌండేషన్ https://manasfoundation.org/, స్థానిక కమ్యూనిటీలతో చేతులు కలిపింది.

ఇప్పటివరకు ఢిల్లీ, హర్యానా, రూర్కీ, తెలంగాణలోని 120+ పాఠశాలల్లో 400+ మరుగుదొడ్లను విజయవంతంగా నిర్మించాయి. 2025 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి, కంపెనీ మరో 100+ మరుగుదొడ్లను అందిస్తుంది, వేలాది మంది బాలికలు వారి విద్యను నిరాటంకంగా కొనసాగించే అవకాశాన్ని కల్పిస్తుంది.

సోమానీ ఇంప్రెసా గ్రూప్ స్ట్రాటజీ హెడ్, హింద్వేర్ లిమిటెడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ శశ్వత్ సోమానీ మాట్లాడుతూ.. ‘‘’బిల్డ్ ఎ టాయిలెట్, బిల్డ్ హర్ ఫ్యూచర్’ క్యాంపెయిన్ ఐదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో, తగినంత పారిశుధ్యం ద్వారా యువతులకు సాధికారత కల్పించాలన్న మా నిబద్ధత స్థిరంగా ఉంది.

బాలికలు నిరాటంకంగా పాఠశాలకు హాజరయ్యేలా చూడటం ద్వారా, మేము భారతదేశ భవిష్యత్తు కోసం పెట్టుబడి పెడుతున్నాము. దీనిని సాకారం చేయడంలో మా భాగస్వాములు మరియు కమ్యూనిటీల నిరంతర మద్దతుకు మేము కృతజ్ఞులము. ప్రతి అమ్మాయికి పాఠశాలలో ఉండటానికి, కలలు కనే ధైర్యం ఉన్న భవిష్యత్తును నిర్మించడంలో మాతో చేరండి.”అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement