Monday, September 23, 2024

Adani Stocks | హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్… అదానీ షేర్లు ఢమాల్

అదానీ స్టాక్స్ మళ్లీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. హిండెన్‌బర్గ్ నివేదిక అదానీ గ్రూప్‌ను మరోసారి కలవరపెడుతోంది. హిండెన్‌బర్గ్ నివేదికపై సెబీ చైర్‌పర్సన్ ఆదివారం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సోమవారం మార్కెట్ ప్రారంభమైన తర్వాత అదానీ షేర్లు భారీగా పడిపోయాయి. అదానీ లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు కలిగి ఉన్న ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ1.29 లక్షల కోట్లు ఆవిరైంది.

దీంతో అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు 2 శాతం నుంచి అత్యధికంగా 17 శాతం వరకు పతనాన్ని నమోదు చేశాయి. ఇన్వెస్టర్లు దాదాపు 53 వేల కోట్లు నష్టపోయినట్లు అంచనా. అదానీ ఫ్లాట్ షిప్ కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈలో టాప్ లూజర్లలో అగ్ర స్థానంలో నిలిచాయి. గతంలో హిండెన్బర్గ్ ఇచ్చిన రిపోర్టులో అదానీ షేల్ కంపెనీల గురించి ప్రస్తావిస్తే.. ఇప్పుడు ఏకంగా సెబీ ఇన్వాల్వ్మెంట్ ఉందని రిసేర్చ్ తెలిపింది.

అదానీ షేర్ల విలువ ఆర్టిఫిషియల్ గా పెంచేందుకు ఉపయోగించిన మారిషస్‌ ఫండ్‌లలో సెబీ ఛైర్​పర్సన్​ మాధబి పురికి వాటాలు ఉన్నాయని చేసిన హిండెన్‌బర్గ్‌ రిపోర్టులో చెప్పింది. ఐతే.. ఈ రిపోర్టును ఖండిస్తూ సెబీ చీఫ్‌ మాధబి బచ్‌ చేసిన వ్యాఖ్యలు మరిన్ని ప్రశ్నలకు అనుమానాలు కలుగజేస్తోందని హిండెన్‌బర్గ్‌ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement